Pakistan Crisis: భారత్ , పాక్ వద్ద హై టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం నెలకొంది. ఇప్పటికే అక్కడ నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇండియా పాక్ మధ్య ఎప్పుడూ ఏం జరుగుతుందో కూడా తెలీడం లేదు.
అక్కడి ప్రభుత్వం నగదు విత్ డ్రా పై కూడా ఆంక్షలు విధించింది. రోజుకు కేవలం రూ. 3000 మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని పరిమితిని పెట్టింది. కొత్త రూల్స్ పెట్టడంతో ప్రజలు నిత్యవసర సరుకుల కొనడం డబ్బును డ్రా చేసుకోవడం కోసం బ్యాంకులు వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే, మూడు వేలు మత్రమే పెట్టడంతో అక్కడ నివసించే జనాలు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read: Kesineni Nani: కేశినేని చిన్నీని వదలని నాని.. సీఎంకు మరో సంచలన లేఖ.. ఈసారి ఏకంగా..
ఆ బ్యాంక్ .. ఈ బ్యాంక్ అని లేకుండా అన్నీ బ్యాంకుల వద్దకు క్యూ లు కట్టి మరి వెళ్ళి డబ్బు ను డ్రా చేసుకుంటున్నారు. ఇక కొందరైతే రాత్రి పూట అక్కడే పడుకుని డబ్బు ను డ్రా చేసుకుని ఇళ్లకు వెళ్తున్నారు. అదే విధంగా అక్కడున్న పరిస్థితులను చూసి అక్కడ ఆర్ధిక సంక్షోభం ఏర్పడిదంటూ ఇంటర్నేషనల్ మీడియా కూడా వెల్లడించాయి. మరో వైపు అక్కడున్న స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. అలాగే, పెట్టుబడీ దారులకు కూడా తీవ్ర ఎదరుదెబ్బ తగిలింది. యుద్దం ఇదే విధంగా కొనసాగితే పాకిస్తాన్ లో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. యుద్దానికి మా సైన్యం ఒక్కటే సరిపోదు .. మాకు సహాయం చేయండంటూ ఇతర దేశాల వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.