Imran Khan's Son: పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ కుమారుడు వార్నింగ్!
Imran Khan's Son (Image Source: Twitter)
అంతర్జాతీయం

Imran Khan’s Son: ఇమ్రాన్ ఖాన్ మృతిపై వదంతులు.. పాక్ ప్రభుత్వానికి కుమారుడు స్ట్రాంగ్ వార్నింగ్!

Imran Khan’s Son: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ను జైలులోనే హత్య చేశారంటూ అఫ్గానిస్థాన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం.. పాక్ లో తీవ్ర కలవరానికి కారణమయ్యాయి. దీనికి తోడు ఇమ్రాన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం అనుమానాలను మరింత బలపరిచాయి. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ కుమారుడు స్పందించారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఆరు వారాలుగా డెత్ సెల్‌లో..

ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీం ఖాన్ (Kasim Khan) ఎక్స్ వేదికగా స్పందిస్తూ పాక్ లోని షెహబాద్ షరీఫ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత నెలన్నర రోజులు నుంచి తన తండ్రిని చూడలేదని పేర్కొన్నారు. ఆయనతో కాంటాక్ట్స్ పూర్తిగా రద్దయ్యాయని అన్నారు. ఆరు వారాలుగా తన తండ్రిని ఒంటరిగా డెత్ సెల్ లో ఉంచేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు సోదరిమణులను జైలులోకి అనుమతించలేదని ఆరోపించారు. తనతో పాటు తన సోదురుడు సైతం ఇమ్రాన్ తో మాట్లాడలేకపోయాడని ఖాసీం ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ సమాజం జోక్యం..

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత స్థితిని తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారని ఖాసీం ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో తన తండ్రికి ఏం జరిగినా దానికి పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. మరోవైపు తన తండ్రి విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మానవ హక్కుల సంస్థలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ లో అత్యధిక ప్రజాధరణ కలిగిన వ్యక్తిని జైలులోని అంతమెుందిచే కుట్ర జరుగుతోందని ఖాసీం అన్నారు. తన తండ్రిని చూసేలా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజానికి విన్నవించుకున్నారు.

6-7 నెలలుగా ఇబ్బందులు

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సోదరిమణుల్లో ఒకరైనా అలీమా ఖానూమ్ కూడా పాక్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అన్నను కలుసుకునేందుకు చేసిన అని ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ‘గత 6-7 నెలలుగా జైలు అధికారులు, పాక్ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జైలులో ఉన్న అన్నను కొన్నిసార్లు  కలవనిస్తాయి. మరి కొన్నిసార్లు ఎవరినీ అనుమతించరు. ఎన్నోసార్లు గంటల తరబడి బయట వేచి చూసిన పరిస్థితులు ఉన్నాయి’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read: Maoists Letter: అందరం లొంగిపోతాం.. కాస్త సమయం ఇవ్వండి.. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

జైలు అధికారుల ప్రకటన

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మరణంపై వస్తున్న వార్తలను ఆయన శిక్ష అనుభవిస్తున్న అదియావాలా జైలు ఖండించింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో సురక్షితంగా ఉన్నారని గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన తెహ్రీక్ – ఇ – ఇన్సాఫ్ కు సైతం సమాచారం ఇచ్చినట్లు జైలు అధికారులు చెప్పారు. ఇమ్రాన్ కు అవసరమైన వైద్య సదుపాయాలు సైతం జైలులో అందుతున్నట్లు స్పష్టం చేశారు. కాబట్టి ఆయన మృతిపై వస్తున్న పుకార్లను ఇమ్రాన్ అనుచరులు నమ్మవద్దని హితవు పలికారు. అయితే ఇమ్రాన్ ను ప్రత్యక్షంగా చూసేవరకు తమ నిరసనలు ఆగబోవని కుటుంబ సభ్యులతో పాటు ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Bigg Boss 9: ఫైర్ మోడ్‌‌‌లో సాగుతున్న బిగ్ బాస్ కెప్టెన్సీ రేస్.. ఇమ్మాన్యూయేల్ కోపానికి కారణం ఇదే..

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!