Trump Warns Hamas
అంతర్జాతీయం

Trump Warns Hamas: ‘హలోనా? గుడ్‌బైనా?.. ఒక్కడూ మిగలడు’.. ట్రంప్ బిగ్ వార్నింగ్

Trump Warns Hamas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తన చర్యలు, ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హమాస్ కు మారోమారు తీవ్ర హెచ్చరికలు జారీ చేసి ట్రంప్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. హమాస్ (Hamas) చెరలోని బందీలను విడిచిపెట్టకుండా గాజా (Gaza War)ను నాశనం చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్టును ట్రంప్ పోస్టు చేశారు.

ఏదో తేల్చుకోండి..

హమాస్ విడుదల చేసిన 8 మందితో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ (US Whight House) లో తాజాగా సమావేశమయ్యారు. వారితో సంభాషణ అనంతరం హమాస్ పై విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘హలోనా? లేదా గుడ్ బైనా?’ ఏదో తేల్చుకోవాలంటూ హమాస్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడంతో పాటు ఇప్పటికే చంపిన వాళ్ల మృతదేహాలను అప్పగించాలని అన్నారు. తాను చెప్పింది చేయకుంటే ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇదే చివరి హెచ్చరిక

హమాస్ చెరలో చిక్కుకొని ఛిద్రమైన కొందరు బందీలను తాను కలిసినట్లు ట్రంప్ తన ఎక్స్ (Twitter) పోస్టులో గుర్తుచేశారు. ‘ఇదే నా చివరి హెచ్చరిక, గాజాను ఇప్పుడే వీడండి. ఇదే చివరి అవకాశం కూడా’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఎదురు స్తోందన్న ట్రంప్.. హమాస్ చెరలో బందీలు విడుదల కాకుంటే అది దక్కదని తేల్చిచెప్పారు. బందీలను గనుక రిలీజ్ చేయకుంటే దాని పరిణామాలు తప్పక అనుభవించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

Also Read: S Jaishankar: లండన్ లో ఉగ్ర కలకలం.. భారత విదేశాంగ మంత్రిపై దాడికి యత్నం

ట్రంప్ ను పట్టించుకోని హమాస్

ఇజ్రాయిల్ – హమాస్ మధ్య 2023 అక్టోబర్‌ 7వ తేదీన గాజా యుద్ధం(Gaza War) మొదలైంది. తొలుత హమాస్‌ జరిపిన మెరుపు క్షిపణి దాడుల్లో 1,200 మంది ఇజ్రాయిల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఇజ్రాయెల్‌ పౌరుల్ని, విదేశీయుల్ని హమాస్‌ ఎత్తుకెళ్లి తమ చెరలో బంధీలుగా ఉంచుకుంది. దీంతో ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే బందీల విషయంలో హమాస్‌ను బెదిరిస్తూనే ఉన్నారు. బందీలను విడుదల చేయకుంటే అంతుచూస్తానంటూ పలుమార్లు బెదిరించారు. కానీ హమాస్ ట్రంప్ హెచ్చరికలను ఇప్పటివరకూ పెద్దగా పట్టించుకోలేదు. ఈసారైనా స్పందిస్తుందేమో చూడాలి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!