Sydney: ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఆదివారం ఒక భయంకర ఘటన చోటు చేసుకుంది. అక్కడ అనేక గన్ షాట్లు విన్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు వెంటనే ఎమర్జెన్సీ చర్యలు తీసుకున్నారు. బీచ్ దగ్గర ఉన్న ప్రజలకు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాల్లో వెళ్లాలని సూచించారు.
న్యూస్ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కానీ, పరిస్థితి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదని, ప్రజలు ఆ ప్రాంతంలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని బట్టి చూస్తే.. కొందరు వ్యక్తులు నేలపై కూర్చుని ఉన్నారు. గాయపడ్డ వారి ఖచ్చిత సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది, కానీ కనీసం 10 మంది గాయపడ్డారని అంచనా. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, పరిస్థితి స్థిరంగా ఉందో లేదో పరీక్షిస్తున్నారు.
ఈ సంఘటన స్థానిక పర్యాటకులు, సర్వసాధారణ ప్రజలకు పెద్ద భయం కలిగించింది. పోలీసులు ప్రజలను ఏవైనా అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే తెలియజేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం బోండీ బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు, ఎమర్జెన్సీ సర్వీసులు, పోలీస్ పరిశీలనలు కొనసాగుతున్నాయి. పరిస్థితి పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాతే కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

