Massive Highway Crash: ఒకదానికొకటి ఢీకొన్న 50 వాహనాలు
Massive Highway Crash (Image Source: Twitter)
అంతర్జాతీయం

Massive Highway Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 50 వాహనాలు.. 26 మందికి పైగా

Massive Highway Crash: జపాన్‌లోని గున్మా ప్రిఫెక్చర్‌ (Gunma prefectural)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినాకామి పట్టణంలోని కనేట్సు ఎక్స్‌ప్రెస్‌వే (Kan-etsu Expressway)పై మంచు కారణంగా నియంత్రణ తప్పి సుమారు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 77 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా, మరో 26 మంది గాయపడ్డారు. మంచుతో నిండిన రోడ్లపై వాహనాలు జారిపోవడంతో డ్రైవర్లు సకాలంలో బ్రేకులు వేయలేకపోయారు. ఈ కారణం చేతనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.

జపాన్ రాజధాని టోక్యోకు సుమారు 160 కి.మీ దూరంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గున్మా ప్రిఫెక్చర్‌ హైవే పోలీసుల (Gunma prefectural highway police) సమాచారం ప్రకారం, డిసెంబర్ 26 రాత్రి కనేట్సు ఎక్స్‌ప్రెస్‌వే తొలుత రెండు ట్రక్కులు ఢీకొన్నాయి. ఆ సమయంలో మంచు భారీగా కురుస్తుండటంతో పాటు విజన్ సరిగా లేదు. దీంతో అటుగా వచ్చిన కొన్ని వాహనాలు మంచు పేరుకుపోయిన రహదారిపై బ్రేకులు వేయలేకపోయాయి. దీంతో ఒకదానికొకటి వరుసగా ఢీకొంటూ వచ్చాయి. ఈ ప్రమాదంలో 50కి పైగా వాహనాలు ధ్వంసమైనట్లు జపాన్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాదంలో కొన్ని వాహనాల్లో పేలుడు సైతం సంభవించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయని తెలిపారు.

Also Read: Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

అదృష్టవశాత్తు ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. టోక్యోకు చెందిన 77 ఏళ్ల మహిళ మాత్రం ప్రాణాలు కోల్పోయిందని.. 26 మంది గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద అనంతరం చెలరేగిన అగ్నిప్రమాదంలో పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయని స్పష్టం చేశారు. కొన్ని వాహనాలు పూర్తిగా కాలిపోగా.. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే మంటలు ఆర్పేందుకు అత్యవసర సిబ్బందికి 7 గంటల సమయం పట్టిందని వివరించారు. రోడ్డుపై పడి ఉన్న వాహనాలను ప్రస్తుతం క్లియర్ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. వాహనాల శిథిలాలను తొలగిచేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read: Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!

Just In

01

Jagga Reddy on Pawan Kalyan: సినిమాలోనే కాదు.. బయటా యాక్టింగే.. పవన్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Harish Rao: కాంగ్రెస్ ఉన్నంతకాలం యూరియా సమస్య తీరదా? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్!

Xiaomi vs iPhone: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?

VC Sajjanar: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. అలా దొరికితే మీ పని అంతే .. సజ్జనార్​ స్ట్రాంగ్ వార్నింగ్!

Mega Victory song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..