Pakistan Air Force (Image Source: Twitter)
అంతర్జాతీయం

Pakistan Air Force: ఫేక్‌లో కాలేసిన పాక్ ఉప ప్రధాని.. పార్లమెంటు సాక్షిగా నవ్వులపాలు!

Pakistan Air Force: భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor).. పాక్ ను చావు దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. పాక్ లోని ఉగ్ర, వైమానిక స్థావరాలను భారత వైమానిక దళం నాశనం చేశాయి. అయితే తమకు జరిగిన తీవ్ర నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాక్ నేతలు కింద మీద పడుతున్నారు. ఈ క్రమంలో అజ్ఞానంతో ఆ దేశ పార్లమెంటులో మాట్లాడుతూ నవ్వులపాలు అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ (Ishaq Dar) చేసిన కామెంట్స్ నెట్టింట హాస్యాస్పదంగా మారాయి.

ఇంతకీ ఏమన్నారంటే?
పాకిస్థాన్ పార్లమెంటు (Pakistan Parlament) లో ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన కామెంట్స్ నెట్టింట ట్రోల్స్ కు గురవుతున్నాయి. బ్రిటీష్ మీడియా సంస్థ ‘ది డైలీ టెలిగ్రాఫ్’ (The Daily Telegraph).. పాక్ ఎయిర్ ఫోర్స్ ను పొగుడుతూ కథనాలు ప్రచురించిందని ఇషాక్ దార్ చట్ట సభకు తెలియజేశారు. ‘పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్.. ఆకాశంలో ఎదురేలేని రారాజు (Pakistan Air Force is the undisputed king of the skies) అని రాసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వార్త క్లిప్లింగ్ ను సైతం సెనెట్ కు చూపించారు. ఇది నిజమేనని నమ్మి.. సభ్యులు సైతం చప్పట్లు కొట్టారు.

కట్ చేస్తే.. అంతా ఫేక్!
అయితే పాక్ ఉప ప్రధాని చెప్పుకున్నట్లు ‘ది డైలీ టెలిగ్రాఫ్’ ఎలాంటి కథనాన్ని ప్రచురించలేదు. ఏఐతో క్రియేట్ చేసిన హెడ్ లైన్ నిజమనుకొని ఇషాక్ దార్ బడాయికి పోయారు. అసలు అలాంటి హెడ్ లైన్ తాము పెట్టలేదని డైలి టెలిగ్రాఫ్ సైతం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని పాక్ మీడియా సంస్థ డాన్ (The Dawn) తన ఫ్యాక్ట్ చెక్ టీమ్ ద్వారా కన్ఫామ్ చేసింది. అంతేకాకుండా దీనిపై పెద్ద ఎత్తున్న కథనాలు కూడా ప్రచురించింది. దీంతో ఇషాక్ దార్ ఇంట బయట నవ్వులు పాలవుతున్నారు. పాక్ చెందిన వారే ఈ ఏఐ హెడ్ లైన్ ను క్రియేట్ చేసి పెట్టినట్లు తెలుస్తోంది.

నెటిజన్లు ఫైర్..!
ఆపరేషన్ సిందూర్ లో చావు దెబ్బ తిని కూడా పాక్ నేతలు గొప్పలు చెప్పుకుంటూ ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా పాక్ ఉప ప్రధాని చేసిన కామెంట్స్ ను నెట్టింట ఎండగడుతున్నారు. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న ఇంకా బుద్ధి రాలేదా? అని నిలదీస్తున్నారు. ఫేక్ న్యూస్ కు, ఒరిజినల్ న్యూస్ తేడా తెలియని స్థితిలోకి పాక్ నేతలు వెళ్లిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అటు పాక్ పౌరులు సైతం తమ నేతలను చూసి సిగ్గుపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు పాక్ ను చిన్నచూపు చూస్తున్నాయని.. తమ మాటలతో నేతలు మరింత పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Tirumala Update: తిరుమల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మీరు సిద్ధమేనా!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు