JD Vance Shooting: అగ్రరాజ్యం అమెరికాలో సంచలన ఘటన జరిగింది. ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance Shooting) నివాసంపై కాల్పులు జరిగాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటి నగరంలోని ఈస్ట్ వాల్నట్ హిల్స్‌లో ఉన్న ఆయన ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. సోమవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, కాల్పులు జరిగిన సమయంలో జేడీ వాన్స్ ఇంట్లో లేరని, ఈ ఘటనలో అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తుపాకీ బుల్లెట్ ధాటికి జేడీ వాన్స్ ఇంటి కిటికీల అద్దాలకు రంధ్రాలు పడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది.
జేడీ వాన్స్ ఇంటికి సమీపంలో దుండగుడిని గుర్తించి యూఎస్ సీక్రెట్ సర్వీస్, సిన్సినాటి పోలీసులు రంగంలోకి దిగినట్టుగా స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పరిగెడుతున్న వ్యక్తిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఆఫీర్ ఒకరు, వెంటనే స్పందించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారని తెలిపాయి.
Read Also- Vijay TVK-BJP: తమిళనాడులో బీజేపీ కొత్త స్కెచ్.. విజయ్ టీవీకే పార్టీ విషయంలో అమిత్ షా గేమ్ ప్లాన్!

