Bangladesh Violence: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. మంగళవారం నాడు మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వస్త్ర తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ హిందూ వ్యక్తిని సహచరుడే కాల్చిచంపేశాడు. ఫ్యాక్టరీలో సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో ఈ ఘోరం వెలుగుచూసింది. ఈ ఘటనతో కలిపి కేవలం రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు హిందువులు హత్యకు గురయ్యారు.
లాబిబ్ గ్రూప్ అనే ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం ఈ హత్యా ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని బజేంద్ర బిశ్వాస్‌గా గుర్తించినట్టుగా వెల్లడించారు. అతడి వయసు 42 ఏళ్లు అని వివరించారు. ఇక, నిందితుడు పేరు నొమాన్ మియా అని, అతడి వయసు 29 ఏళ్లు అని, అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Read Also- Self Care Tips: మనసు తట్టుకోలేనంత ఒత్తిడితో నిండి ఉందా?.. అయితే, ఈ చిట్కాల పై ఓ లుక్కేయండి!
వస్త్ర తయారీ ఫ్యాక్టరీలో వీరిద్దరూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని, అదే కంపెనీ ప్రాంగణంలో ఉన్న అన్సార్ బ్యారక్స్‌లో నివాసం ఉంటూ వచ్చారని పోలీసులు వివరించారు. మృతుడు బజేంద్ర బిశ్వాస్, హంతకుడు నొమాన్ మియా ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. సరదా బిశ్వాస్ వైపు తుపాకీ గురిపెట్టానని, అనుకోకుండా బుల్లెట్ దూసుకెళ్లిదంటూ నిందితుడు నొమాన్ చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఫ్యాక్టరీ భద్రత కోసం ప్రభుత్వం జారీ చేసిన తుపాకీతో కాల్పులు జరిపినట్టు తేలిందన్నారు. బిశ్వాస్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించినప్పటికీ, అప్పటికే అతడు చనిపోయినట్టు వివరించారు.
Read Also- IRCTC New Feature: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు.. ఈ తప్పు చేయకండి!

