America Is Clarity on Ukraine's Involvement in Russia Attack
అంతర్జాతీయం

America Clarity : రష్యా దాడిలో ఉక్రెయిన్‌ ప్రమేయంపై అమెరికా క్లారిటీ

America Is Clarity About Ukraine’s Involvement in Russia Attack : రష్యా రాజధాని మాస్కోలో ఈ నెల 22న రాత్రి ఉగ్రవాదులు న‌ర‌మేధానికి పాల్పడ్డారు. క్రాక‌స్ సిటీ క‌న్సర్ట్‌హాల్‌లోకి ఆయుధాల‌తో ప్రవేశించిన ఉగ్రవాదులు విచ‌క్షణ‌ర‌హితంగా కాల్పుల‌కు పాల్పడ్డారు. ఈ దాడిలో 130 మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. తాజాగా మాస్కోలో జ‌రిగిన ఉగ్రదాడితో ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అమెరికా స్పష్టం చేసింది. అంతేగాక ఉక్రెయిన్‌కు ప్రమేయం ఉంద‌న‌డానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవ‌ని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో మంగళవారం శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్‌ జీన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ… ఉగ్రదాడికి పాల్పడింది ఐసీస్ సంస్థేనని ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌ పుతిన్ తెలుసుకున్నారు. ఈ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. ఈ దాడితో ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అందుకు తగిన ఆధారాలు కూడా లేవని ఆమె తెలిపారు.

Read Also : చైనా ఆయిల్‌ నౌకపై హౌతీ మిసైళ్ల దాడి

మాస్కో నరమేధాన్ని అమెరికా ఇప్పటికి తీవ్రంగా ఖండిస్తూనే ఉందని ఈ సందర్భంగా సెక్రటరీ చెప్పారు. దీనికి పూర్తి బాధ్యత ఐసిస్‌దేనని ఆమె వ్యాఖ్యానించారు. మార్చి 7న రష్యాలోని అమెరికా పౌరులపై జరిగిన దాడిపై అడ్వైజరీ జారీ చేశామని గుర్తు చేశారు.ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ గతంలోనే ప్రకటించింది.

దీనిని అమెరికా సైతం ధృవీకరించింది. అయితే..ఈ ఉగ్రదాడికి ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. దాడి తర్వాత నిందితులు ఉక్రెయిన్‌కి పారిపోయేందుకు ప్రయత్నించారని ఆయన తెలిపారు. కాగా..పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు అమెరికా కూడా ఇదే విషయమై మరోసారి క్లారిటీ ఇచ్చింది.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్