Houthi Missile Attack on Chinese Oil Ship : ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు ఎకదాటిగా దాడులు నిర్వహిస్తున్నాయి. తాజాగా శనివారం యెమెన్ తీరానికి సమీపంలో ఉన్న చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూపై హౌతీలు బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్ ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ధృవీకరించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తోంది.
అయితే ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్‌లోని మంగళూరు పోర్ట్‌కు రావాల్సి ఉండగా ఉన్నట్టుండి దాడి నిర్వహించింది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ కూడా గాయపడలేదు. నౌకలో మంటలు చెలరేగినప్పటికి 30 నిమిషాల్లో వాటిని ఫైర్ ఇంజన్ల సాయంతో ఆర్పివేశారు. అనంతరం నౌక మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. చైనా, భారత్ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీలు తాజా దాడితో మాట తప్పారని ఇరు దేశాలు ఫైర్ అవుతున్నాయి.
Read Also : బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్‌కు క్యాన్సర్, ఇది ఏఐనా డౌటే..!?
కాగా… ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు మోపెడవుతుంది. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నాయి. దీంతో ఇరు దేశాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. అంతేకాదు ఇది ఏం మాత్రం సహించేది లేదని ఈ చర్యను ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి.
MARCH 23 RED SEA UPDATE
From 2:50 to 4:30 a.m. (Sanaa time)
March 23, the Iranian-backed Houthis launched four anti-ship ballistic missiles (ASBM) into the Red Sea in the vicinity of M/V Huang Pu, a Panamanian-flagged, Chinese-owned, Chinese-operated oil tanker.At 4:25 p.m.… pic.twitter.com/n1RwYdW87E
— U.S. Central Command (@CENTCOM) March 24, 2024