Burkina Faso Attack: పశ్చిమా ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో (Burkina Faso)లో ముష్కర మూకలు రెచ్చిపోయాయి. అల్ ఖైదా (Al-Qaeda) అనుబంధ సంస్థగా పిలవబడే జిహాదీలు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి ఘటన.. ఆలస్యంగా వెలుగు చూసింది.
బుర్కినా ఫాసోలోని జిబో (Djibo) పట్టణాన్ని టార్గెట్ చేసుకొని ముష్కర మూకలు ఈ దారుణానికి తెగబడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. అల్ ఖైదాకు చెందిన జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) ఉగ్రవాదులు.. ఈ మారణహోమం తమ పనేనని ప్రకటించుకున్నారు.
మారణహోమం.. 100 మందికి పైగా మృతి..!
బుర్కినా ఫాసోలో జిహాదీ మూక చేసిన దాడిలో 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం
వారిలో చాలా మంది సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది
డజిబో సహా పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు చేసిన మూకలు
#BurkinaFaso pic.twitter.com/tzwFen6Jf4— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2025
అయితే బుర్కినా ఫాసోలో ప్రస్తుతం సైనిక పాలన జరుగుతోంది. జుంటా ఈ సైనిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. కాగా బుర్కినా ఫాసోను హస్తగతం చేసుకునేందుకు JNIM ఉగ్రవాదులు గత కొన్నెళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దశాబ్దాల కాలంగా సైన్యానికి JNIM ఉగ్రవాదులకు మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది.
Also Read: Sandeep Kumar Sultania: ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా
ఈ క్రమంలో ఆదివారం జిబో పట్టణాన్ని టార్గెట్ చేసిన JNIM ఉగ్రవాదులు ఏకకాలంలో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మెుత్తం 8 ప్రాంతాలపై ఒకేసారి దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారు. మోటార్ సైకిల్స్ పై ఎంటర్ అయిన ముష్కరులు.. ఆదివారం ఉదయం 6 గం.లకు కాల్పులు ప్రారంభించారని.. దానిని మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొనసాగించారని పేర్కొంటున్నారు.