Sandeep Kumar Sultania: ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి నియామకం
Sandeep Kumar Sultania (Image Source: Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Sandeep Kumar Sultania: ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా

Sandeep Kumar Sultania: తెలంగాణ పాలనపరమైన వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాను నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ కె. రామకృష్ణారావు (K. Ramakrishna Rao) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం గానీ లేదా రేపు ఉదయం సుల్తానియా ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

Also Read: MLC Kavitha: మంత్రి సీతక్కపై కవిత సంచలన కామెంట్స్!

ఇదిలా ఉంటే ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు మెున్నటి వరకూ తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇటీవల మాజీ సీఎస్ శాంతి కుమారి (Santhi Kumari) పదవి విరమణ చేయడంతో ఆమె స్థానంలోకి కొత్తగా కె. రామకృష్ణరావు వచ్చారు. దీంతో ఆర్థిక కార్యదర్శి స్థానంలో ఖాళీ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో సందీప్ కుమార్ సుల్తానియా (Sandeep Kumar Sultania) బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read This: Sumanth on Nagarjuna: నాగార్జున గురించి నమ్మలేని నిజాలు బయట పెట్టిన అక్కినేని సుమంత్

Just In

01

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

Sircilla Panchayat Elections: రెండో దశ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ముందంజ.. దరిదాపుల్లో కూడా లేని బీజేపీ!

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్