Woman Constable: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
Lady-Constable (Image source X)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Woman Constable: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Woman Constable: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మహిళా కానిస్టేబుల్​ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో (Woman Constable) జరిగింది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్​ ప్రాంతంలోని పద్మావతి కాలనీకి చెందిన ప్రమీల, బాలాజీ నాయక్​ భార్యాభర్తలు. ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. సోమవారం నాడు ప్రమీల తాను నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. సిటీ న్యూరో హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స అందుతోంది. మరింత మెరుగైన వైద్యం కోసం ప్రమీలను సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా, ప్రమీల దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవి పహార్ తండా చెందిన వారని సమాచారం.

కాగా, కుటుంబ సమస్యల కారణంగానే ప్రమీల ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించిందంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రమీణ 2020 సంవత్సరం బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్ అని తెలిసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రమీల ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు పోలీసు దర్యాప్తులో బయటపడనున్నాయి. కుటుంబంలో చోటుచేసుకున్న మనస్పర్థలే ఇందుకు కారణమంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ, నిజాలు ఏంటనేది దర్యాప్తులో వెల్లడవుతుంది. అయితే, ఆమె కోలుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

Read Also- January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే

Just In

01

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి

Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు