Indiana State - GHMC (imagecredi:twitter)
హైదరాబాద్

Indiana State – GHMC: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరినట్లేనా? మేయర్ ఏమన్నారంటే!

తెలంగాణ బ్యూరోస్వేచ్ఛ: Indiana State – GHMC: జీహెచ్ఎంసీ తో అమెరికా దేశానికి చెందిన ఇండియనా స్టేట్ తో-2010  సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో  రాష్ట్రానికి ఆ చెందిన ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసింది. మేయర్ విజయలక్ష్మి ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఇండియనా ప్రతి నిధులు మేయర్ కు వివరించారు.

ఈ సందర్భంగా ప్రతినిధి బృందం హైదరాబాద్ గతంలో కంటే అభివృద్ధి చెందినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిని పెంచి గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.హైదరాబాద్ చుట్టూ మరో  త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు,ఉత్తరం వైపు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.

Also Read: Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!

ప్రజా పాలన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ లో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణకు రూ.7032 కోట్లతో రోడ్డు వెడల్పు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపట్టి,ట్రాఫిక్  నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ పనులన్నీ పూర్తయితే గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందుతుందని వివరించారు.నగరంలో పాఠశాల విద్యా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ప్రతినిధులను మేయర్ కోరగా,సానుకూలంగా స్పందించి అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని వారు వివరించారు.

ఇండియానా పోలీస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డియాగో మోరల్స్, చింతా ల రాజు, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ గ్రోత్ అండ్ స్ట్రాటజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం రాష్ట్ర పర్యటనకు మేయర్ ను ఆహ్వానించారు. తప్పకుండ మా పాలక మండలి, అధికారులతో కూడిన బృందంతో వస్తామని, ఆహ్వానించిందుకు మేయర్ ఆ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Bhatti Vikaramarka: భలే ఛాన్స్ పట్టేసిన భట్టి.. ఏకంగా ఆ కమిటీలోనే స్థానం..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!