GHMC: మానవాళికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ఈ-వేస్ట్ పై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. నిన్న మొన్నటి వరకు పరిపాలన, జీహెచ్ఎంసీ(GHMC)పై పడుతున్న ఆర్థిక భారంపై దృష్టి సారించి ప్రక్షాళన చేసిన కమిషనర్ ఇపుడు ఈ-వేస్ట్(E-waste) పై దృష్టి సారించారు. కమిషనర్ గా ఆర్.వి. కర్ణన్(RV Kranan) బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రధాన కార్యాలయంలోని ఈ వేస్ట్ పై దృష్టి సారించి, మొత్తం లెక్కలేయించినట్లు సమాచారం. దీంతో ఒక్క జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలోనే ఏడు అంతస్తుల్లో మొత్తం రెండున్నర టన్నుల ఈ- వేస్ట్ ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. మిగిలిన జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో ఇంకా ఎంత వరకు ఈ-వేస్ట్ పడి ఉందో కూడా గుర్తించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
వార్డు ఆఫీసు మొదలుకుని, సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయం వరకు ఎక్కడా కూడా పాడైన కంప్యూటర్లు(Computers), ఏసీ(AC)లు, కంప్యూటర్ల విడిభాగాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కేవలం జీహెచ్ఎంసీ(GHMC)కి చెందిన కార్యాలయాల్లోనే గాక, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లోనూ ఈ -వేస్ట్ ఎక్కడా కూడా నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వ్యవహారంపై జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు స్పెషల్ గా నజర్ పెట్టాలని కూడా కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ వేస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, ఆ వేస్ట్‌ను ఏ కార్యాలయంలోనూ రోజుల తరబడి నిల్వ ఉంచకుండా ఎప్పటికపుడు తరలించేలా ఏర్పాట్లు చేసుకుని, గ్రేటర్ పరిధిలో పర్యావరణ పరిరక్షణకు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుతూ కమిషనర్ కర్ణన్(RV Karnan) త్వరలోనే ఐటీ కంపెనీలకు లేఖ రాయనున్నట్లు సమాచారం.
Also Read: Suresh Raina: రూట్ మార్చిన రైనా.. సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ షురూ!
తరలింపునకు 10 ఎలక్ట్రిక్ వెహికల్స్
నగరంలో ఐటీ(IT) సంస్థలెక్కువగా ఉన్న శేరిలింగంపల్లి(Sherelingam Pallly) జోన్ తో పాటు ఖైరతాబాద్ జోన్ లోని పలు సర్కిళ్లలోని ఐటీ కంపెనీల నుంచి ఈ వేస్ట్ ను తరలించేందుకు జీహెచ్ఎంసీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఫౌండేషన్ డే సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద అందజేసిన పది వాహానాలను వినియోగించాలని కమిషనర్ ఖైరతాబాద్(Khairatabadh), శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ ఎలక్ట్రిక్ వాహానాలను ఎస్ బీఐ హైదరాబాద్(Hyderabad) సర్కిల్ చాప్టర్ సమర్పించినట్లు వెల్లడించారు. ఈ వేస్ట్ ను ఎక్కడా కూడా రోజుల తరబడి నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కమిషనర్ సర్కిల్లు, జోన్ల వారీగా సేకరించిన ఈ వేస్ట్ ను నగర శివారులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించాలా? మరేదైనా ఇతర ప్లేస్ కు తరలించాలా? అన్నదానిపై క్లారిటీ రావల్సి ఉంది. ప్యారానగర్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆధునిక డంపింగ్ యార్డుకు వీటిని తరలించాలని ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
Also Read: Harish Rao: బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట.. ప్రణాళికలు రూపొందిస్తున్న పార్టీ