Suresh Raina
ఎంటర్‌టైన్మెంట్

Suresh Raina: రూట్ మార్చిన రైనా.. సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ షురూ!

Suresh Raina: మాజీ ఇండియన్ క్రికెటర్ సురేశ్ రైనా తన క్రికెట్ కెరీర్ కి రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. రైనా కథానాయకుడిగా తమిళంలో ఓ చిత్రం రాబోతుంది. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో రైనా కథానాయకుడిగా నటించనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యక్రమం నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‌కి శివం దూబె హాజరై ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సురేశ్ రైనా అందుబాటులో లేకపోవడంతో రాలేక పోయారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమ్‌స్టర్‌డ్యామ్ హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. అక్కడి నుంచి వీడియో కాల్ ద్వార కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ కొనసాగుతోంది. త్వరలో సినిమా టైటిల్ ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

Also Read- Fish Venkat Wife on Prabhas: ప్రభాస్ పైసా ఇవ్వలే.. అంతా ఫేక్ న్యూస్.. ఫిష్ వెంకట్ భార్య!

సురేశ్ రైనా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకి డ్రీమ్ నైట్ స్టూడియోస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. దీనిని నిర్మాత శరవణ కుమార్ అధికారికంగా ప్రకటించారు. సురేశ్ రైనా నటిస్తున్న సినిమాకి కోలీవుడ్ దర్శకుడు లోగన్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కె విజయ్ ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రెసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేయనున్నారు. సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చనున్నారు. సుప్రీం సుందర్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read- SSMB29: మహేష్ రాజమౌళి సినిమాపై.. సింహం, పులి సీరియస్ డిస్కషన్.. వీడియో చూస్తే కడుపు చెక్కలే!

తమిళ క్రికెట్ అభిమానులు అమితంగా ఇష్టపడే ధోనీ తర్వాతి స్థానంలో సురేశ్ రైనా ఉంటారు. ఆయన్ని తమిళ క్రికెట్ అభిమానులు చిన్నతాలగా పిలుచుకుంటారు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కే తరఫున 176 మ్యాచుల్లో ఆడారు. 2010, 2011 సీఎస్‌కే టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నో సార్లు సీఎస్‌కే తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధోనీతో కలిసి ఎన్నో మ్యాచులు గెలిపించాడు. 2020లో UAEలో జరిగిన ఐపీఎల్ సీజన్‌కు రైనా వ్యక్తిగత కారణాలతో వెళ్ళలేకపోయారు. దీంతో తర్వాత సంవత్సరాల్లో సీఎస్‌కే జట్టులో తన స్థానం కోల్పోయారు. 2022 తర్వాత ఐపీఎల్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పారు. క్రికెట్ లోని అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రైనా ఐపీఎల్లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. మరి ఇప్పుడు తీసుకుంటున్న ఈ టర్న్ ఆయనను బిజీ నటుడిని చేస్తుందో.. లేదంటే ఒక్క సినిమాతోనే ఆపేస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రైనా తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?