SSMB29: సింహం, పులి ఫన్నీ డిస్కషన్.. వీడియో వైరల్!
SSMB29 (Image Source: Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

SSMB29: మహేష్ రాజమౌళి సినిమాపై.. సింహం, పులి సీరియస్ డిస్కషన్.. వీడియో చూస్తే కడుపు చెక్కలే!

SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో గ్లోబల్ స్థాయి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే రాజమౌళి గత చిత్రం.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో పులి (Tiger) రిఫరెన్స్ తో తీసిన కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో మహేష్ (Mahesh Babu)తో రూపొందిస్తున్న SSMB29 సినిమాలోనూ సింహాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనికి సంబంధించి ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజమౌళితో ఉన్న వర్క్ ఎక్స్ పీరియన్స్ ను సింహంతో పులి పంచుకుంటున్నట్లుగా ఉన్న ఏఐ వీడియో ప్రస్తుతం నెట్టంట హల్ చల్ చేస్తోంది. సింహం – పులి మధ్య జరిగిన ఫన్నీ డిస్కషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

సింహం ప్రగల్భాలు!
SSMB29 చిత్రానికి సంబంధించి సింహం, పులి మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్ లో ఈ రెండు క్రూర మృగాలు మాట్లాడుకుంటున్నట్లుగా ఏఐ వీడియో (AI Video)ను డిజైన్ చేశారు. వీడియో ప్రారంభంలో సింహాం మాట్లాడుతూ.. ‘ఓరెయ్ పులి.. నాకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ వచ్చింది’ అని అంటుంది. హీరో ఎవరు అనుకున్నావ్ అని సింహం అనగానే.. ‘మహేష్ బాబు గారు’ అంటూ ముందే తెలిసినట్లుగా ఠక్కున పులి సమాధానం ఇస్తుంది. దీంతో సింహం.. నా రేంజ్ ఏమనుకున్నావ్ అంటూ ప్రగల్భాలు పలుకుతుంది.

పులి సెటైర్లు
ఆర్ఆర్ఆర్ సందర్భంగా రాజమౌళితో తనకు ఉన్న అనుభవాన్ని.. సింహంతో పులి పంచుకుంటుంది. ‘ఇప్పుడు నీకు అలాగే ఉంటుంది. రెండేళ్ల క్రితం నేను రాజమౌళి గారితో సినిమా చేశా. అందులో ఇద్దరు హీరోలు (రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్). ఒకరేమో (తారక్) మత్తుమందు కొట్టారు. ఇంకొకరైతే (చరణ్) డైరెక్ట్ గా ముఖంపైన కొట్టారు’ అని సింహంతో అంటుంది. అంతేకాదు ‘ఓరేయ్ షేరూ నీకూ ఇన్సూరెన్స్ ఉంది కదా?’ అంటూ సింహాన్ని పులి ప్రశ్నిస్తుంది. ఇన్సూరెన్స్ ఎందుకురా అని సింహం అడగ్గా.. ‘అసలే ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆయనతోనే (మహేష్ బాబు) సినిమా చేస్తున్నావ్. జాగ్రత్త మామా’ అని పులి సమాధానం ఇస్తుంది.

Also Read: Harish Rao: బనకచర్లతో ఏపీ నీళ్ళు దోచుకుంటే పేగులు తెగేదాకా కొట్లాడుతాం!

‘నీకు సావేరా.. కన్ఫార్మ్’
పులి మాటలకు బెదిరిపోయిన సింహం.. ‘ఉండరా బాబు తెగ భయపట్టెస్తున్నావ్’ అంటూ కసురుకుంటుంది. అసలే రేపు మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ అంటా అని పులితో సింహం అంటుంది. దానికి పులి సమాధానం ఇస్తూ.. ‘నీకు సావేరా కన్ఫామ్’ అని బదులిస్తుంది. దీంతో సింహం ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టినట్లు సైలెంట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సింహం, లయన్ మాటలు.. వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తం మీద ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ సరదాగా నవ్వుకుంటున్నారు. మీరు ఓ సారి చూసేయండి.

Also Read This: Samarlakota Crime: చెల్లితో సీక్రెట్ లవ్.. సైలెంట్‌గా లేపేసి.. భూమిలో పాతేసి..!

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..