Harish Rao: నాడైనా.. నేడైనా తెలంగాణ ప్రయోజనాల ముందు పదవులు బీఆర్ఎస్‌కు తృణప్రాయం అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బనకచర్లతో ఏపీ అప్పనంగా నీళ్ళు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20ఏళ్ల క్రితం ఇదే రోజున (2005 జూలై 4న) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఆదేశానుసారం, ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామన్నారు.
Also Read: Samarlakota Crime: చెల్లితో సీక్రెట్ లవ్.. సైలెంట్‌గా లేపేసి.. భూమిలో పాతేసి..!
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ బనకచర్ల (Andhra Pradesh Banakacherla) పేరిట గోదావరి నీళ్ల దోపిడీ చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసే ఏ కుట్రలనైనా బీఆర్ఎస్ పార్టీ (BRS party) సహించదని స్పష్టం చేశారు. పదవులకు రాజీనామాలు చేయడం మాత్రమే కాదు, పేగులు తెగేదాకా కొట్లాడుతామన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపలా ఉంటామని, కంటికి రెప్పలా ఉండి కాపాడుకుంటామని వెల్లడించారు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం, ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తామని హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు.
Also Read: Hyderabad Water Board: జలమండలి స్పెషల్ ఫోకస్.. నీటి చౌర్యం మీటర్ల ట్యాంపరింగ్‌లకు చెక్!