Hyderabad Water Board(Image credit: twitter)
హైదరాబాద్

Hyderabad Water Board: జలమండలి స్పెషల్ ఫోకస్.. నీటి చౌర్యం మీటర్ల ట్యాంపరింగ్‌లకు చెక్!

Hyderabad Water Board: హైదరాబాద్ మహానగరవాసులు దాహర్తిని తీరుస్తున్న జలమండలి (Water Board) ఆదాయంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సరఫరా చేస్తున్న నీటికి తగిన విధంగా బిల్లింగ్ ఎందుకు కావడం లేదన్న విషయంపై దృష్టి సారించింది. చాలా కమర్షియల్ కనెక్షన్లకు సంబంధించి జలమండలి (Water Board) సరఫరా చేస్తున్న నీటికి తగినట్టుగా బిల్లులు వసూలు కాకపోవడంతో కమర్షియల్ కనెక్షన్లకు ఆటోమేటెడ్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్)లను బిగించేందుకు నిర్ణయం తీసుకుంది. తొలి దశగా మొత్తం 6290 వాటర్ కనెక్షన్లకు ఈ కొత్త మీటర్లను బిగించేందుకు వీలుగా జలమండలి మంజూరీ తీసుకుంది.

వీటిలో సింహా భాగం కనెక్షన్లు కమర్షియల్ క్యాటగిరికి చెందినవి ఉన్నట్లు సమాచారం. ఏళ్ల క్రితమే 6290 మంది వినియోగదారుల నుంచి ఈ మీటర్లకు సంబంధించిన ఛార్జీలను వసూలు చేసుకున్న జలమండలి పక్కాగా నీటి వినియోగాన్ని నమోదు చేసుకుని, దానికి తగిన విధంగా బిల్లులు వసూలు చేసేందుకు ఆధునిక మీటర్లను వినియోగించాలని భావిస్తుంది. సుమారు ఐదేళ్లు క్రితమే ఛార్జీలు వసూలు చేసుకున్న వాటర్ బోర్డు ఇప్పుడు ఈ మీటర్ల కోసం ఏజెన్సీలు, సంస్థల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను ఆహ్వానిస్తుంది. ఈ నెల 15 వరకు బిడ్‌లను స్వీకరించేందుకు గడువు విధించింది. ఈ మీటర్లకు సంబంధించి నవంబర్ 2019 నుంచి 2025 మే వరకు ఈ ఛార్జీలను వసూలు చేసినట్లు సమాచారం.

 Also Read: Ramchandra Rao: గ్యారంటీల పేరుతో హడావుడి.. అమలులో శూన్యం!

ఏ కనెక్షన్‌కు ఎన్ని మీటర్లు
జలమండలి (Water Board) మంజూరు చేసే వివిధ రకాల సైజు కనెక్షన్లను బట్టి ఈ మీటర్ల సంఖ్యను కేటాయించింది. వీటిలో 25 మి.మీ.ల సైజు కనెక్షన్ మొదలుకుని 350 మి.మీ.ల వరకు రకరకాగల సైజున్న వాటర్ కనెక్షన్లున్నాయి. వీటిలో 25మి.మీ.ల సైజు ఉన్న 4747 కనెక్షన్లకు, 40మి.మీ.ల సైజున్న 596 కనెక్షన్లకు, 50 మి.మీ.ల సైజున్న 438 కనెక్షన్లకు, 75 మి.మీ.ల సైజున్న 131 కనెక్షన్లకు, అలాగే వంద మి.మీ.ల సైజున్న 186 కనెక్షన్లకు, 200 మి.మీ.ల సైజున్న 56 కనెక్షన్లతో పాటు 250 ఎం.ఎం. సైజున్న 12 కనెక్షన్లతో పాటు 300 ఎం.ఎం సైజున్న 10 కనెక్షన్లతో పాటు 350 మి.మీ.ల సైజున్న ఒక కనెక్షన్ తో కలుపుకుని మొత్తం 6వేల 290 వాటర్ కనెక్షన్లకు ఈ మీటర్లను బిగించాలని జలమండలి (Water Board) భావిస్తుంది.

బోర్డు కార్యాలయానికి లింకు
మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 6 వేల 290 వివిధ సైజుల్లోని వాటర్ కనెక్షన్లకు ఆటోమేటెడ్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్)లను బిగించినా, వాటి రీడింగ్ మాత్రం జల మండలి (Water Board) ప్రధాన కార్యాలయం నుంచే నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్న టెక్నాలజీని వినియోగించి, మీటర్లను వినియోగదారులు ఎవరూ కూడా ట్యాంపరింగ్ చేయకుండా జల మండలి (Water Board) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే డ్యాష్ బోర్డు ద్వారా ఈ మీటర్ల రీడింగ్‌లను గమనించి, నీటి వినియోగానికి తగిన విధంగా బిల్లులను జనరేట్ చేసేందుకు వీలుగా వాటర్ బోర్డు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అల్ట్రాసోనిక్ టెక్నాలజీని వినియోగించి జీఎస్ఎం కమ్యూనికేషన్ మాడ్యూల్‌తో ఆ మీటర్లకు సంబంధించిన బిల్లులను జనరేట్ చేసే దిశగా వాటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మీటర్ల ఐదేళ్లు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని బోర్డు భావిస్తుంది.

 Also Read: Huzurnagar: తమిళ కంపెనీకి లాభాలు.. తెలంగాణ ప్రజలకు రోగాలు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు