Ramachandra Rao: కాంగ్రెస్ దోపిడీకి తెలంగాణ అక్షయపాత్రగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) ఆరోపణలు చేశారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే (Congress) కాంగ్రెస్ సభ నిర్వహించిందని ఒక ప్రకటనలో ఫైరయ్యారు. పదే పదే ప్రజలను మభ్యపెట్టే నినాదాలు చెప్పే కాంగ్రెస్, (Congress) వాటికి విరుద్ధంగా పనిచేస్తున్నదని విమర్శలు చేశారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్, (Congress) సామాజిక న్యాయ సమరభేరి అంటూ మరోసారి తెలంగాణ ప్రజలను మాయ చేయాలని చూసిందని మండిపడ్డారు.
Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!
ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని రాంచందర్ రావు ప్రశ్నించారు. జై బాపు అంటూ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్, (Congress) గాంధీజీ కలల గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసిందని చురకలంటించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం, గ్రామాభివృద్ధి పనుల బిల్లులకు రూ.1,200 కోట్లు పెండింగ్‌లో పెట్టడం, గాంధీజీ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
జై భీమ్ అంటూ నినదిస్తున్న కాంగ్రెస్, (Congress) వాస్తవంగా లగచర్ల, కొండగల్ వంటి ప్రాంతాల్లో గిరిజనుల భూములు లాక్కుని, పోడు భూములపై బుల్డోజర్లు పంపి, ఎస్టీ రైతులపై కేసులు బనాయించి, గురుకులాల మూసివేతలతో దుర్మార్గంగా వ్యవహరించిందని వివరించారు. జై సంవిధాన్ అని పఠించే ముందు కాంగ్రెస్ తన చరిత్రను గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీకి రాజ్యాంగంపై బోధనలు చెప్పే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఇవన్నీ మరిచి మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తెలంగాణకు వచ్చారని, కాంగ్రెస్ (Congress) ఏ ముఖం పెట్టుకుని సభ నిర్వహించిందని రాంచందర్ రావు (Ramchandra Rao) ప్రశ్నించారు.
Also Read: Huzurnagar: తమిళ కంపెనీకి లాభాలు.. తెలంగాణ ప్రజలకు రోగాలు