Twist In MMTS Case: ఇటీవల హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు (MMTS Rail)లో మహిళపై అత్యాచారయత్నం జరిగిందంటూ వచ్చిన వార్తలు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నిందుతుడి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలు నుంచి ఆమె దూకేయడంతో ఆందోళన చోటుచేసుకుంది. ఎప్పుడు రద్దీగా ఉండే రైలులో మహిళకు రక్షణ లేదా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే లోకల్ ట్రైన్స్ (Hyderabad Local Trains)లో మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్న చర్చ సైతం మెుదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసుకు సంబంధించి బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
పచ్చి అబద్దమేనట!
హైదరాబాద్ ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం కేసుకు సంబంధించి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ట్రైన్ లో అసలు అత్యాచారమే జరగలేదని తాజాగా పోలీసులు కేసు క్లోజ్ చేశారు. ఇన్ స్టా రీల్స్ చేస్తూ యువతి రైలు నుంచి జారిపడిందని రైల్వే ఎస్పీ చందనా దీప్తి తేల్చారు. దానిని కప్పిపుచ్చేందుకు ఈ అత్యాచారం నాటకం ఆడినట్లు విచారణలో తేలిందని అన్నారు. దాదాపు 300 పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు ఆమె వివరించారు. ఇదే విషయమై యువతిని ప్రశ్నించగా యువతి తన తప్పును అంగీకరించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి మెుత్తం 120 మంది అనుమానితులను పోలీసులు విచారించడం గమనార్హం.
MMTS లో అత్యాచారం కేసులో సంచలన ట్విస్ట్
అసలు ట్రైన్ లో అత్యాచారమే జరగలేదని కేసు క్లోజ్
INSTA లో రీల్స్ చేస్తూ రైలు నుంచి జారిపడిన యువతి
దాన్ని కప్పిపుచ్చేందుకు అత్యాచారం పేరుతో కట్టుకథ
దాదాపు 225 సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు
100 మంది అనుమానితులను విచారించిన… pic.twitter.com/pxSFbsZmbe
— BIG TV Breaking News (@bigtvtelugu) April 18, 2025
అసలేం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన బాధితురాలు (23) ఉద్యోగ రిత్యా హైదరాబాద్ కు వచ్చింది. మేడ్చల్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఆ ఏరియాలో నివాసముంటోంది. ఈ క్రమంలో యువతి మెుబైల్ చెడిపోవడంతో ఆమె సికింద్రాబాద్ వెళ్లింది. అక్కడ ఫోన్ రిపేర్ చేయించుకొని రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ లో మేడ్చల్ కు బయలుదేరింది. ఈ క్రమంలో బాధితురాలు రైలు కింద పడి తీవ్ర గాయాలతో కనిపించడటంతో స్థానికులు ఆమెను రక్షించారు. ఈ క్రమంలో తనపై అత్యాచారయత్నం జరిగిందని ఆ యువతి చెప్పడంతో అందరూ ఖంగు తిన్నారు. తీరా అది ఫేక్ అని తాజాగా వెల్లడి కావడంతో అంతా అవాక్కవుతున్నారు.
Also Read: Pashu Bima Padhakam: రూ.288 చెల్లిస్తే రూ.30,000.. ఈ బీమా స్కీమ్ మీకు తెలుసా!
ఆ ఘటనతో రైల్వే అప్రమత్తం
లోకల్ ట్రైన్ లో అత్యాచార యత్నం జరిగినట్లు ఒక్కసారిగా వార్తలు రావడంతో అప్పట్లో దక్షిణ మధ్య రైల్వే శాఖ సైతం అప్రమత్తం. మహిళల భద్రత కోసం ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ బటన్స్ (Panic Buttons) ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్ లోకల్ ట్రైన్స్ లో మహిళల రక్షణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ మెుదలైన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ (Arun Kumar Jain) రంగంలోకి దిగారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలో MMTS రైళ్లలో ‘పానిక్ బటన్స్’ తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అలాగే బోగీల్లో సీసీ కెమెరాలు, ఆర్పీఎఫ్ పోలీసుల భద్రతను పెంపొందించాలని తీర్మానించారు.