Pashu Bima Padhakam (Image Source: AI)
ఆంధ్రప్రదేశ్

Pashu Bima Padhakam: రూ.288 చెల్లిస్తే రూ.30,000.. ఈ బీమా స్కీమ్ మీకు తెలుసా!

Pashu Bima Padhakam: ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ప్రజలు పశువుల పెంపకంపై ఆధార పడుతుంటారు. వాటిని పోషించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అయితే పశువులకు ఏమాత్రం నష్టం వాటిల్లినా వారి జీవితాలు తలకిందులు అవుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు గణనీయ సంఖ్యలో మృత్యువాత పడుతుంటాయి. మేతకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా పడే పిడుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటాయి. కాగా, ప్రస్తుతం ఎండకాలంలోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశువుల కోసం ఏపీ ప్రభుత్వం ఓ అద్భుతమైన బీమా పథకాన్నితీసుకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

100 జీవాలకు బీమా
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. పశువుల కోసం ప్రత్యేకంగా ఓ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. గొర్రెలు, మేకల అకాల మరణాల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఒక కుటుంబానికి లేదా రేషన్ కార్డుకి ఒక సంవత్సరానికి 100 జీవాల వరకూ పశు బీమా వర్తిస్తుంది. 6 నెలలు ఆపైన వయసు కలిగిన గొర్రెలు లేదా మేకలు ఈ బీమా తీసుకున్న తర్వాత మరణిస్తే ఒక్క దానికి రూ.6000 చొప్పున బీమా లభించనుంది.

85శాతం రాయితీ
పశు బీమా పథకం కింద కూటమి ప్రభుత్వమే 85శాతం మేర ప్రీమియాన్ని భరించనుంది. మిగిలిన 15 శాతం మాత్రమే లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కింద మెుత్తం మూడు రకాల ప్రీమియంలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి దాంట్లో 3% ప్రీమియంతో ఏడాదికి కాలానికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో గొర్రెకు ప్రీమియం విలువ రూ.180 ఉండగా అందులో రూ.153 ప్రభుత్వమే చెల్లించనుంది. మిగిలిన రూ.27లను పశు పెంపకం దారులు చెల్లించాల్సి ఉంటుంది.

2, 3 ఏళ్లకు ప్రీమియం
అలా కాకుండా రెండో ప్రీమియాన్ని ఎంచుకుంటే 4.5 శాతం ప్రీమియంతో 2 ఏళ్ల కాలానికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి రూ.270 ప్రీమియంగా నిర్ణయించారు. అందులో ప్రభుత్వం రూ.230 చెల్లిస్తే.. లబ్దిదారుని వాటాగా రూ.40 ఉండనుంది. మూడో రకం ప్రీమియాన్ని ఎంచుకుంటే అది మూడేళ్ల కాలానికి వర్తిస్తుంది. దీని విలువ రూ.375 కాగా..  రాయితీ కింద ప్రభుత్వం రూ.319 చెల్లించనుంది. లబ్దిదారుడు అందులో తన వాటాగా రూ.56 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Congress on BRS: సీఎం జపాన్ పర్యటన.. తెరపైకి మళ్లీ ఈనోలు.. ఏమన్నా ట్రోలింగా!

ఆవులు, గేదెలకు బీమా
మేకలు, గొర్రెలతో పాటు ఆవులు, గేదెలకు సైతం ప్రత్యేకించి ఏపీ ప్రభుత్వం బీమా సదుపాయాన్ని కల్పించింది. ఒకసారి ఈనిన 2-10 సంవత్సరాల వయసు గల ఆవులు, 3-12 ఏళ్లు గల గేదెలు ఈ బీమాకు అర్హులు. ఒక కుటుంబానికి 10 పశువుల వరకూ బీమా వర్తిస్తుంది. బీమా కాల వ్యవధి 3 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ బీమాలో భాగమైన మేలుజాతి ఆవులు/గేదెలకు ఒకదానికి రూ.30,000, నాటు రకం ఆవు/గేదెలు ఒకదానికి రూ.15,000 చెల్లించనున్నారు.

ప్రీమియం చెల్లింపులు ఇలా
ఆవులు, గేదెల బీమా ప్రీమియాన్ని రెండు రకాలుగా ప్రభుత్వం విభజించింది. మేలు జాతి పశువులకు 3 ఏళ్ల కాలానికి రూ.1920 ప్రీమియాన్ని తీసుకొచ్చింది. ఇందులో రూ.1632 ప్రభుత్వమే చెల్లించనుండగా.. మిగిలిన రూ.288లను లబ్దిదారుడు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు నాటు జాతి పశువుల కోసం తీసుకొచ్చిన బీమా ప్రీమియం రూ.960గా ఉంది. ఇందులో ప్రభుత్వ వాటా చెల్లింపులు రూ.816 కాగా.. లబ్ది దారుడు రూ.144 చెల్లిస్తే సరిపోతుంది. పశు బీమా పథకం కోసం మరిన్ని వివరాలు కావాల్సినవారు దగ్గరలోని పశు వైద్యశాల గానీ, రైతు సేవా కేంద్రాన్ని గానీ సంప్రదించవచ్చు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు