Congress on BRS: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ప్రస్తుతం జపాన్ (Japan Tour)లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్.. ఆ దేశంలో పర్యటిస్తున్నారు. జపాన్ లోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజే రూ. 1000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాన్ని సైతం కూదుర్చుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఇది చూసి ప్రత్యర్థి పార్టీలకు కడుపు మండుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
ఈనో కంపెనీలకు విజ్ఞప్తి
సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్న వేళ.. రాష్ట్రంలో ఈనో (ENO)ల వినియోగం గణనీయంగా పెరగనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు (Congress Cadre) పేర్కొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న పెట్టుబడులు చూసి విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలకు కడుపు మండితున్నట్లు నెట్టింట పోస్ట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న 10 రోజుల్లో ఈనోల సేల్స్ రాష్ట్రంలో గణనీయంగా ఉండనున్నట్లు చెబుతున్నారు. సదరు ఈనో కంపెనీ.. డిమాండ్ కు అనుగుణంగా సేల్స్ ను తెలంగాణలో పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
#Eno పాకెట్ తయారీ సంస్థకి చిన్న విజ్ఞప్తి
రాబోయే 10 రోజుల్లో మీ కంపెనీ సెల్స్ #Telangana లో అద్భుతంగా ఉండబోతున్నాయి కావున మీ యొక్క తయారీనీ పెంచండి
#RevanthReddy గారు #Japan దేశంకి వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకరాబోతున్నారు
రాష్టంలో ఉన్న కొంత మంది కి కడుపు మంట తప్పదు pic.twitter.com/NAYlrW8zuw
— Shashi Kumar Reddy Vura (@vurashashi) April 16, 2025
గతంలోనూ ఇదే తరహాలో..
ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన దావోస్ పర్యటన సమయంలోనూ కాంగ్రెస్ శ్రేణులు ఈనో ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ పర్యటనలో సీఎం రేవంత్ ఏకంగా రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. అయితే రేవంత్ దావోస్ పర్యటనపై అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాటిని తిప్పికొట్టిన కాంగ్రెస్ శ్రేణులు.. రేవంత్ పెట్టుబడులు సాధించడాన్ని చూసి ఆ పార్టీ ఓర్వలేకపోతోందని వ్యాఖ్యానించారు. వారి కడుపు మండిపోతోందని సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే సిటీలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు ఈనో ఉన్న బ్యానర్లు పెట్టి ట్రోల్ చేశారు.
ఇవాళ మరిన్ని ఒప్పందాలు!
సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం (Telangana Rising Delegation) జపాన్ లో వరుసగా మూడో రోజూ విజయవంతంగా పర్యటిస్తోంది. ఇవాళ పలు కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటి కానున్నారు. భారత రాయబార కార్యాలయం (Embassy of India)లో వారితో భేటి అయ్యి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇవాళ ప్రముఖ సంస్థలైన తోషిబా (Toshiba), టయోటా (Toyota), ఎన్టీటీ (NTT), ఏసిస్ (Aces), కంపెనీల సీఈఓవోలతో సీఎం రేవంత్ భేటి కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad Crime: పిల్లలకు వింత వ్యాధి.. పట్టించుకోని భర్త.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు
గురువారం జపాన్ (Japan)కు చెందిన మారుబేని కంపెనీ (Marubeni Company)తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ (Hyderabad Future City)లో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీ ఓకే చెప్పింది. దాదాపు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.