Hyderabad Crime: కన్న బిడ్డలను ఓ తల్లి కొడవలితో నరికిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జీడిమెట్ల పోలీసు స్టేషన్ (Jeedimetla police station) పరిధిలోని గాజుల రామారంలో జరిగిన ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలిచివేసింది. బిడ్డల దారుణ హత్య అనంతరం ఆ తల్లి కూడా భవనంపై నుంచి దూకి ఆత్యహత్య చేసుకుంది. అయితే పదేళ్ల లోపున్న ఇద్దరు మగ పిల్లలను అంత కసిగా ఆ తల్లి ఎందుకు చంపుకోవాల్సి వచ్చిందోనన్న ప్రశ్న ప్రతీ ఒక్కరినీ వెంటాడుతోంది. ఈ క్రమంలోనే తల్లి తేజస్విని (Tejaswini) రాసిన సూసైడ్ నోట్ బయటకొచ్చింది. అందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
6 పేజీల సూసైడ్ నోట్
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వర్ రెడ్డి (38), తేజస్విని (33) భార్య భర్తలు. గాజులరామారం బాలాజీ లేఅవుట్ లో నివాసముంటున్న వీరిద్దరికి ఆశిష్ రెడ్డి (7), హర్షిత్ రెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు. అయితే ఇద్దరు చిన్నారులను హత్య చేసి తేజస్వినీ ఆత్మహత్య చేసుకుంది. అయితే తేజస్విని ఇంత క్రూరమైన నిర్ణయం ఎలా తీసుకుందన్న ప్రశ్న ఒక్కసారిగా ఉత్పన్నమైంది. ఈ క్రమంలో 6 పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు.
నోట్ లో ఏముందంటే?
తేజస్విని ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో ఆమె రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్ బయటపడింది. అందులో పిల్లలకు అరుదైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఫలితంగా 4, 5 గంటలకు ఒకసారి కళ్లల్లో డ్రాప్స్ వేస్తే గాని వారికి కనిపించిన పరిస్థితి ఉంటోందని సూసైడ్ నోట్ లో తెలిపింది. పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు భర్త సహకరించడం లేదని వాపోయింది. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ పిల్లలకు పనిరాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇంట్లో భర్త ఉన్న సమయంలో చికాకు, కోపంతో కసురుకుంటూ ఉంటాడని తెలిపింది. దీంతో ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయని.. భర్త కూడా కోపంతో చస్తే చావండి అంటుండాని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తేజస్విని సూసైడ్ నోట్ లో స్పష్టం చేసింది.
Also Read: Custom Officials Seized Mobiles: విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసుల తనికీలు.. విలువైన వస్తువులు పట్టివేత..!
తేజస్వినికి అనారోగ్య సమస్య
పిల్లలకు ఉన్న సమస్యనే తేజస్వినీకి సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆమె నుంచే ఈ కంటి సమస్య పిల్లలకు సైతం వచ్చినట్లు సమాచారం. చాలా ఏళ్లుగా తేజస్వినీ ఈ అరుదైన వ్యాధితో తీవ్ర మనో వేదన అనుభవిస్తోంది. పిల్లలకు సైతం ఈ సమస్య రావడంతో ఆమె కష్టం మరింత రెట్టింపయ్యింది. పిల్లల అవస్థలు చూడలేక, డబ్బు ఉండి మెరుగైన వైద్యం అందిచలేక తనలో తానే చాలా కుమిలిపోయేదని బంధువులు చెబుతున్నారు. భర్త నుంచి సైతం సహకారం లేకపోవడంతో ఇక చావే శరణ్యమని తేజస్విని భావించిందని అంటున్నారు. అయితే ఇంత క్రూరంగా పిల్లలను చంపడం మాత్రం తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.