Malkaajgiri Excise ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సయిజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి లక్షా 50వేల రూపాయల విలువ చేసే 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్​ సూపరిండింటెంట్ నవీన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడ నివాసి వీరస్వామి (47) రక్షణ సంస్థల్లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడు.

 Also Read: GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాలు చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం

డిఫెన్స్​ క్యాంటీన్ల నుంచి వారితో మద్యం కొనిపించేవాడు. రెండు మూడు వందలు కమీషన్​ గా వారికి ముట్టజెప్పేవాడు. ఆ తరువాత తన లాభం కలుపుకొని వాటిని ఇతరులకు అమ్ముతూ వస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందటంతో అసిస్టెంట్ ఎక్సయిజ్​ సూపరిండింటెంట్​ ముకుంద రెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్​ఐలు కుమారస్వామి, సంధ్యారాణితోపాటు సిబ్బందితో క​లిసి వీరస్వామి ఇంటిపై దాడి జరిపారు. మద్యం బాటిళ్లతోపాటు మొబైల్ ఫోన్​, బైక్​ ను స్వాధీనం చేసుకున్నారు.

నాంపల్లిలో గంజాయి సీజ్​…

విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సయిజ్​ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ సీ టీం అధికారులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 5వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి అఫ్జల్ సాగర్​ ప్రాంతంలో నివాసముంటున్న సచిన్​ ఉపాధ్యాయ తన ఇంట్లోనే గంజాయి స్టాక్ చేస్తూ అమ్ముతున్నట్టుగా అధికారులకు తెలిసింది. ఈ క్రమంలో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో క​లిసి దాడి చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.

 Also Read:Nagarkurnool Politics: నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయ వేడి… మర్రి మాటలకు కూచుకుళ్ల కౌంటర్ 

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్