Telangana govt(image credit: X)
హైదరాబాద్

Telangana govt: మత్స్యకారులకు గుడ్ న్యూస్.. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌.. మీ ముందుకు..

Telangana govt: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్య ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి స్థాయికి రాష్ట్రం ఎదిగింది. ఉత్పత్తులు ప్రతియేటా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణ చేపలను మంచినీటి వనరుల్లో పెంచుతున్నందున రుచి బాగుండడంతో మార్కెట్లలో వీటికి మంచి డిమాండ్‌ ఉంది.

తెలంగాణ బ్రాండ్‌ పేరుతో వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడంతోపాటు విక్రయాల ద్వారా మత్స్య కార్మికుల ఆదాయం పెంచే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా కోహెడ ప్రాంతంలో అతిపెద్ద హోల్‌ సేల్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. గత ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ..అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది.

చేపల ఉత్పత్తిలో రాష్ట్రం టాప్‌
మంచినీటి చేపల ఉత్పత్తుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 5.73లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపల ఉత్పత్తి జరుగుతుండగా..గత యేడాది వివిధ రకాల చేపల ఉత్పత్తి 4,39,513 టన్నులు ఉండగా..రొయ్యల ఉత్పత్తి 16,532 టన్నులుగా ఉంది. మొత్తంగా రూ.9వేల కోట్ల మత్స్య సంపదతో చేపలకు హబ్‌గా రాష్ట్రం ప్రగతిని సాధించింది. అయితే ఉత్పత్తి అవుతున్న చేపల్లో కేవలం 6 శాతం మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల నుంచి తెలంగాణ చేపలకు విపరితమైన డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆస్థాయిలో ఎగుమతులు జరగడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపల క్రయవిక్రయాలకు చిన్న మార్కెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా మిగులు చేపలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నారు.

10 ఎకరాల విస్తీర్ణంలో హోల్‌ సేల్‌ మార్కెట్‌
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే హోల్‌ సేల్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. అయితే మార్కెట్‌ కోసం స్థల సేకరణ చేపట్టకపోవడం, నిధుల కేటాయింపులు లేకపోవడంతో మార్కెట్‌ ఏర్పాటు అంశం అటకెక్కింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోహెడ ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద హోల్‌ సేల్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.47కోట్ల నిధులకు కేటాయింపులను సైతం జరిపింది.

Also read: Medchal News: గంజాయి పుష్పాలు చిక్కారు.. పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మార్కెట్లలో ఏటా లక్ష టన్నులకు పైగా చేపల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని కోహెడ వద్ద చేపల హబ్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం సంకల్పించింది. విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రం నలుమూలలకు కేంద్ర బిందువుగా ఉండడం..శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో కోహెడ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.

అయితే అనువైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్‌ను నిర్మించనున్నారు. శీతల గిడ్డంగులు, శుద్ది యూనిట్లు, చేపల నిల్వ, వాహనాల పార్కింగ్‌కు సంబంధించి అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. లైవ్‌ చేపలతోపాటు ఎండు, చిల్డ్​‍ చేపలు ఏడాది పొడవునా మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ మార్కెట్‌ వల్ల 5వేల మందికి ఉపాధి కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌ అందుబాటులోకి వస్తే మత్స్య కారులకు ఆదాయం పెరగడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన చేపలు దొరుకుతాయి. అదేవిధంగా మిగులు చేపలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు విరివిగా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?