హైదరాబాద్: Pakistani nationals: హైదరాబాద్ నుండి వెళ్లిపోయిన నలుగురు పాకిస్థాన్ దేశీయులు పాకిస్థాన్ షార్ట్ టర్మ్ వీసా దారులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసుల నోటిసులు అందించారు. దీంతో వారు వెళ్లి పోయారు. పోలీసులు నోటిసులు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ లో నలుగురు పాకిస్తాన్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు.
వైద్యం కోసం మెడికల్ తో వచ్చిన వారికి ఈనెల 29వరకు మినహాయింపు ఇచ్చారు. ఇ నెల 30లోపు ఆటరీ బోర్డర్ నుండి వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు. మిగతవారి వీసాలను వివిధ క్యాటగిరీలకు సంబంధించిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు పాకిస్తాన్ దేశ వాసుల లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయి.
Also Read: Merugu Nagarjuna: ఏపీలో నీరు లేదు.. బీరు ఉంది.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్
నిజామాబాద్ లో లాంగ్ టర్మ్ వీసాలతో 8మంది ఉన్నారు. సైబరాబాద్ లో 11 మంది లాంగ్ టర్మ్ వీసా కలిగిన వారున్నారు మరియు ఓ మహిళ షార్ట్ టర్మ్ వీసా తో ఉన్నప్పటికీ కోర్టు కేసు నడుస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు దాపికోసం పరిశీలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 230 మంది పాకిస్తాన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 199 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారని, లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది.