Merugu Nagarjuna:(imagecredit:ttwitter)
ఆంధ్రప్రదేశ్

Merugu Nagarjuna: ఏపీలో నీరు లేదు.. బీరు ఉంది.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్

Merugu Nagarjuna: ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసిపి మాజీ మంత్రి మేరనాగార్ఝున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అని అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని అన్నారు. ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ మోహన్ రెడ్డి ఆధ్యుడు అయ్యాడని అన్నారు.

చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ 15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఊదరగొట్టారని, ఇంటింటికి వెళ్లి నీకు 15 వేలు నీకు 15 వేలు అని చెప్పి నమ్మించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు చెబుతున్నాడు.

Also Read: MP Raghunandan Rao: మదర్సాల్లో ఉన్నోళ్లు ఏ దేశం వాళ్లు?.. డీజీపీతో భేటీ అయిన ఎంపీ!

తల్లికి వందనం పథకాన్ని ఇన్ స్టాల్ మెంట్ లో ఇస్తామని అంటున్నారు ప్రతీ కుటుంబాన్ని ఆదుకుని చదివించిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని మేరుగ నాగార్జున అన్నారు. ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదని, చంద్రబాబు తీరు మాత్రం ఓడదాటే వరకూ ఓడ మల్లన్న తీర రాష్ట్రానికి మంచినీరు దొరకడం లేదేమో కానీ ఏపీలో మందు మాత్రం ఏరులై పారుతోందని అన్నారు.

తల్లికి వందనం పథకానికి ఎలాంటి షరతులు పెట్టకుండా వెంటనే నిధులు ఇవ్వాలని సామాజిక విప్లవంలో పేటెంట్ తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు అమలు చేయాలని అన్నారు. అప్పటి ప్రభుత్వం 72919 కోట్లను కేవలం విద్య కోసం జగన్ మోహన్ రెడ్డి ఖర్చు చేశారని ఆయన గుర్తుచేశారు.

Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ