MP Raghunandan Rao: సంగారెడ్డి జిల్లాలో శివాలయంపై దాడికి పాల్పడిన మదర్సాల్లో ఉన్న పిల్లలు ఏ దేశానికి చెందినవారని, శివ నగర్, సదాశివ పేట మదర్సాలో ఉన్నదెవరని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. డీజీపీ జితేందర్ ను లక్డీకాపూల్ లోని ఆయన కార్యాలయంలో రఘునందన్ రావు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీజీపీకి వినతిపత్రం అందించారు.
సంగారెడ్డి జిల్లాలో శివాలయాన్ని కొందరు ధ్వంసం చేశారని, అక్కడి మదర్సాలో ఉన్న పిల్లలే ఇదంతా చేశారనేందుకు ఆధారాలున్నాయని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. టోపీ పెట్టుకుంటే మనోడు అని పోలీసులు కాపాడుతున్నారన్నారు. మదర్సాలో 12 ఏండ్ల లోపు ఉన్న పిల్లలకు హిందూ సమాజంపై అంత ద్వేషం ఎందుకని ఎంపీ ప్రశ్నించారు. విగ్రహం ధ్వంసమయ్యాక మదర్సాకు చెందిన పిల్లలు లోపలికి వెళ్లి బయటకు వచ్చిన వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.
రామాలయం జాగా లో మదర్సా ఎట్లా వచ్చిందనేది కూడా కలెక్టర్ దృష్టిసారించాలని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శివాలయం ధ్వంసం చేసిన అంశంపై పోలీసులు సకాలంలో స్పందించలేదని, మధ్యాహ్నం ఘటన జరిగితే రాత్రి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేకపోయారన్నారని ఫైరయ్యారు. కేవలం హిందువులపై 4 ఎఫ్ఐఆర్ లు పెట్టారని, బీజేపీ, హిందూ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారని విమర్శలు చేశారు.
Also read: Chinna Jeeyar Swami: నెక్ట్స్ టార్గెట్ చిన్న జీయర్ స్వామి? చిలుకూరు పూజారి సంచలన నిజాలు
ఆ మదర్సా పిల్లలను కూడా హిందువులే పోలీసులకు అప్పజెప్పారని రఘునందన్ రావు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ముత్యాలమ్మ దేవాలయం సంఘటనలో ఇంటెలిజెన్స్ ఎందుకు విఫలమైందని ఎంపీ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ మదర్సాలో ఉన్న అందరిదీ ఏ రాష్ట్రం, ఏ దేశం , మదర్సాల్లో వారికి ఏం నేర్పిస్తున్నారనేది సీఎస్, డీజీపీ పర్యవేక్షించలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో 70వేల మందికిపైగా రోహింగ్యాలు ఉంటున్నారని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
గతంలో డీజీపీ ఆఫీస్ పై బురఖాలో వచ్చి దాడి చేసి తీసుకుపోయి ఘటన మర్చిపోవద్దని ఎంపీ గుర్తుచేశారు. తమది అహింస ధర్మమని, కానీ ఇబ్బంది పెడితే హింస తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, రోహింగ్యాలను పంపించేయాలని, లేదంటే భాగ్యనగరం మండటం ఖాయమన్నారు.