Chinna Jeeyar Swami: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇటీవల కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లో ఉగ్రదాడిపై తాజాగా స్పందించిన ఆయన.. గతంలో తనపై జరిగిన ఆటాక్ గురించి కూడా మరోమారు మాట్లాడారు. తనపై ఫిబ్రవరి 7న దాడి జరిగిన విషయాన్ని మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. కుంభమేళకు వెళ్లి 6 తేదీ రాత్రి తిరిగి వచ్చినట్లు రంగరాజన్ తెలిపారు. అప్పుడే తన తండ్రిని చూసుకోవడానికి తన అన్న వచ్చారని పేర్కొన్నారు.
టేక్ హీం కస్టడీ
తాను అలిసిపోయి నిద్రిస్తున్న సమయంలో నిందితులు వచ్చి తలుపు కొట్టారని రంగరాజన్ తెలిపారు. అయితే తాను ఇప్పుడు ఎవ్వరిని కలువలేనని చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో టేక్ హీం కస్టడీ అంటూ తలుపు తోసుకొని వారు లోపలికి వచ్చారని గుర్తుచేశారు. తనను వెంటనే కింద పడేసి వాళ్లు కుర్చీలో కూర్చున్నట్లు చెప్పారు. రామరాజ్యం కోసం ఏం పని చేస్తున్నావ్? అని ప్రశ్నించి తనపై దాడి చేసినట్లు చెప్పారు. భుజంపై నామాలు ఉన్న చోట కాలితో తన్నారని.. దానిని అంతా వీడియోలో రికార్డ్ చేశారని తెలిపారు.
Also Read: Bharat Summit 2025: ఒకే వేదికపై రాహుల్, రేవంత్.. ప్రభుత్వ ట్రాక్ రికార్డ్స్ తో హోరెత్తించిన సీఎం!
తమ నెక్ట్స్ టార్గెట్
నెక్స్ట్ చిన్న జీయర్ స్వామి మా టార్గెట్ అంటూ వాళ్లు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తనపై నిందితులు ఆరోపణలు చేశారని రంగరాజన్ అన్నారు. తాను ఆడవాళ్లతో ఉన్నానని ఆరోపించారని చెప్పారు. దీనిపై తాను లీగల్ గానే ఫైట్ చేస్తానని.. నిందితులని ఎట్టి పరిస్థితుల్లో వదలనని తెగేసి చెప్పారు. దాడి చేసిన రోజు దాని ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే వాళ్లు చిలుకూరు దాటే వారే కాదని రంగరాజన్ అన్నారు. మరోవైపు పహల్గాం ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన రంగరాజన్.. ప్రస్తుతం హిందువులందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు.