TGSRTC: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. కొత్త కాలనీలకు ఆర్టీసీ సేవలు
TGSRTC (Image Source: Twitter)
హైదరాబాద్

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు

TGSRTC: హైదరాబాద్ లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త కార్యచరణను ప్రకటించింది. ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డిసెంబర్ నెల నుంచే ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి.

7,61,200 మందికి లబ్ధి

టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగర శివారుల్లోని 30 సర్కిళ్లు, 150 వార్డుల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల రవాణా అవసరాలను గుర్తించారు. ఈ కొత్త సేవల ద్వారా ఆయా కాలనీల్లో నివసించే సుమారు 7,61,200 మంది పౌరులకు లబ్ధి చేకూరనుంది.

మూడు దశల్లో అమలు

ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ సౌకర్యార్థం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్, తదితర ఎంప్లాయిమెంట్ హబ్స్ కాలనీల నుంచి నేరుగా బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నడపనుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా ఖర్చు కూడా తగ్గనుంది. హైదరాబాద్ కనెక్ట్ కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. వచ్చే రెండు నెలల్లో అత్యధిక రద్దీ ఉన్న కాలనీల్లో మొదటి దశ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

యాప్‌లో బస్సు వివరాలు

కొత్త కాలనీలకు బస్సుల రాకపోకల వివరాలను రియల్ టైమ్ లో చెక్ చేసుకునే వీలును ఆర్టీసీ కల్పించింది. ఇందుకోసం ‘టీజీఎస్ఆర్టీసీ గమ్యం’ యాప్ ను వినియోగించుకోవచ్చు. ఈ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 373 కాలనీలకు గాను హైదరాబాద్ రీజియన్ లో 243, సికింద్రాబాద్ రీజియన్ లో 130 కాలనీలను ఎంపిక చేశారు.

హైదరాబాద్ రీజియన్ (డిపోల వారీగా):

* దిల్సుఖ్నగర్: 55 కాలనీలు (అత్యధికం)
* రాజేంద్రనగర్: 51 కాలనీలు
* మిధాని: 42 కాలనీలు
* బండ్లగూడ: 34 కాలనీలు
* మెహదీపట్నం: 17 కాలనీలు
* ఇబ్రహీంపట్నం: 14 కాలనీలు
* హయత్ నగర్-1: 12 కాలనీలు
* హయత్ నగర్-2: 10 కాలనీలు
* ఫలక్ నుమా: 7 కాలనీలు
* మహేశ్వరం: 1 కాలనీ.

సికింద్రాబాద్ రీజియన్ (డిపోల వారీగా)

* జీడిమెట్ల: 36 కాలనీలు
* చెంగిచెర్ల: 25 కాలనీలు
* కూకట్పల్లి: 21 కాలనీలు
* మేడ్చల్: 10 కాలనీలు
* ఉప్పల్: 10 కాలనీలు
* హెచ్సీయూ (HCU): 8 కాలనీలు
* మియాపూర్-2: 7 కాలనీలు
* కంటోన్మెంట్: 6 కాలనీలు
* రాణిగంజ్: 4 కాలనీలు
* కుషాయిగూడ: 3 కాలనీలు.

Also Read: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. దుమ్మురేపిన రోహిత్, కోహ్లీ.. టాప్-2 స్థానాలు కైవసం

మంత్రి పొన్నం ఏమన్నారంటే?

నగర విస్తరణకు అనుగుణంగా ప్రజల రవాణ అవసరాలను తీర్చడమే టీజీఎస్ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజా ప్రకటనలో తెలియజేశారు. ‘రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీల వాసులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ‘హైదరాబాద్ కనెక్ట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. క్షేత్రస్థాయిలో విస్తృత సర్వేలు నిర్వహించి ప్రజల విజ్ఞప్తులు, అవసరాలకు అనుగుణంగానే 373 కాలనీలను ఎంపిక చేశాం. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఉద్యోగ కేంద్రాలకు ఈ కాలనీల నుంచి కనెక్టివిటీ పెరగడం వల్ల ఉద్యోగులకు ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతాయి. ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడకుండా సురక్షితమైన ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి’ రవాణా మంత్రి పిలుపునిచ్చారు.

Also Read: CM Revanth Reddy: తమ్ముళ్ల కోసం వచ్చా.. ఓయూని అభివృద్ధి చేసి తీరుతా.. సీఎం రేవంత్ హామీ

Just In

01

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా