CM Revanth Reddy: ఓయూని అభివృద్ధి చేసి తీరుతా.. సీఎం రేవంత్
CM Revanth Reddy (Image Source: Twitter)
Telangana News

CM Revanth Reddy: తమ్ముళ్ల కోసం వచ్చా.. ఓయూని అభివృద్ధి చేసి తీరుతా.. సీఎం రేవంత్ హామీ

CM Revanth Reddy: దేశంలోనే అత్యంత పురాతనమైన చరిత్ర ఉస్మానియా యూనివర్శిటీకి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్ కు పునాది వేసిందే ఓయూ అని రేవంత్ గుర్తు చేశారు. ఓయూకు ఉన్న గొప్ప చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యూనివర్శిటీని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

‘ఓయూకి ఎందుకని అడిగారు”

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో బుధవారం రెండోసారి ఓయూలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. క్యాంపస్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే యువకులు ఇక్కడ ఉన్నారని గుర్తు చేశారు. అయితే సీఎంలు, మంత్రులను అడ్డుకున్న చరిత్ర ఓయూకు ఉందని రేవంత్ పేర్కొన్నారు. దీంతో తనను ఓయూకి ఎందుకు వెళ్తున్నారని కొందరు అడిగారని రేవంత్ తెలిపారు. మీరు దైర్యం చేస్తున్నారని కూడా అన్నట్లు పేర్కొన్నారు. నాది ధైర్యం కాదని.. అభిమానమని వారికి సమాధానం ఇచ్చినట్లు రేవంత్ అన్నారు.

‘ధైర్యం కాదు.. అభిమానంతో వచ్చా’

తన తమ్ముళ్లు ఉన్న యూనివర్శిటీకి రావడానికి తనకు ధైర్యం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుండెల నిండా అభిమానం నింపుకొని ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ ఓయూను కాలగర్భంలో కలిపేందుకు కొందరు యత్నించారని సీఎం రేవంత్ ఆరోపించారు. సర్కార్ బడుల్లో చదువుకున్న తనకు పాలన రాదని ఎద్దేవా చేశారన్నారు. ‘వారు గుంటూరు, అమెరికాలో చదువుకున్నామని గొప్పలు చెప్పుకున్నారు. నేను గుంటూరులో చదవలేదు. గూడు పుఠానీ తెల్వదు. బెంజ్ కార్లలో తిరగలేదు. కానీ ప్రజల మనసు చదవడం నాకొచ్చు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

‘ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’

తెలంగాణ మేధావుల అనుభవంతో వర్శిటీని బాగు చేసుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా విద్య అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. రాజకీయ ఉద్దండులైన జైపాల్ రెడ్డి, జార్జి రెడ్డి ఇక్కడే చదువుకున్నారని సీఎం గుర్తుచేశారు. అంతే కాదు ఆర్థిక మేధావి అయిన పీవీ నరసింహరావును ఈ క్యాంపస్ దేశానికి అందించిందని చెప్పారు. ప్రపంచానికి దిక్సూచిగా ఓయూ విద్యార్థులు మారాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Alluri District: ఫోన్ మాట్లాడొద్దన్న భర్త.. గొడ్డలితో నరికి చంపిన భార్య.. అల్లూరి జిల్లాలో దారుణం

‘వాళ్లకి లాగా ఫామ్ హౌస్‌లు లేవు’

గతంలో ఒక నాయకుడు ఓయూకి వెళ్లాలని సవాలు విసిరారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన లాగా తాను దొంగను కాదని, ఫామ్ హౌస్ లు లేవని విమర్శించారు. జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి తాను వచ్చినట్లు రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బహుజన తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తొక్కి పెట్టిన తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చినట్లు చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. ఆ పార్టీ నేతలు మాత్రం ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని రేవంత్ విమర్శించారు.

Also Read: CM Revanth Reddy: టీ హబ్‌లో గూగుల్ స్టార్టప్ ప్రారంభం.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా