TG Govt on Musi: హైదరాబాద్ మహానగర జీవనది మూసి నదికి పునరుజీవనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో కూడా మూసి పునరుజీవం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇప్పుడు తాజాగా మూసి పరివాహక ప్రాంతాల్లో చేపట్టబోయే అనధికార , ప్రణాళికేతర అభివృద్ధి పనుల నియంత్రణకు ప్రత్యేక ఆదేశాల తో కూడిన జీవో 180 జారీ చేసింది.
Also read: GHMC Property Tax: జీహెచ్ఎంసీకి పండగే పండుగ.. తెగ వచ్చేస్తున్న ఆదాయం
మూసి నది ప్రవహిస్తున్న బఫర్ జోన్ నుంచి 50 మీటర్ల లోపు ఎలాంటి అభివృద్ధి పనులు చేయరాదని,ఇందుకు సంబంధించి 2012లో జారీ చేసిన జీవోను అనుసరించి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మూసి పరివాహక ప్రాంతమైన 50 మీటర్ల నుంచి 100 మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది లేదని కూడా సర్కారు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
మూసీ నది బఫర్ జోన్ 100 మీటర్లు దాటిన తర్వాత ప్రజాప్రయోజనాల నిమిత్తం చేపట్టాల్సిన రోడ్లు, బ్రిడ్జి వంటి నిర్మాణాలకు ఇప్పటికే నియమించిన జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, ఎమ్మార్డీసీఎల్ ,డిటిసిపి అధికారుల లతో కూడిన కమిటీ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని సర్కారు ఆదేశాలు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రణాళికేతర అభివృద్ధి పనులు, నిర్మాణాలు, ఆక్రమణలు నియంత్రించడానికి ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సర్కారు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.