తెలంగాణ బ్యూరోస్వేచ్ఛ : GHMC Property Tax:ఎనిమిదేళ్ల గులాబీ పాలనలో అప్పుల పెరిగి , ఆగమాగమైన జీహెచ్ఎంసీకి కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) బాగా కలిసొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన గత మార్చి నెలాఖరు వరకు టార్గెట్ ను మించి రూ. 2038 కోట్లు వసూలు కాగా, జీహెచ్ఎంసీ ముఖ్య ఆదాయ వనరుల్లో రెండోది ప్లానింగ్. భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణం పూర్తయిన భవనాలకు ఆక్రమించుకునే అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీతో ఈ విభాగానికి కూడా గత ఆర్థిక సంవత్సరం భాగానే ఆదాయం సమకూరినట్లు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తెలిపారు.
గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) లో జీహెచ్ఎంసీ మొత్తం 13 వేల 421 అన్ని రకాల నిర్మాణ అనుమతులను జారీ చేసి, రూ. 1138.44 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఇన్ స్టెంట్ రిజిస్ట్రేషన్లు 523 కాగా, ఇన్ స్టెంట్ అప్రూవల్స్ 8377, సింగ్ విండో ద్వారా మరో 2422, లే అవుట్ విత్ హౌజింగ్ అండర్ గెటెడ్ కమ్యూనిటీ లు 6, లే అవుట్ విత్ ఓపెన్ ప్లాట్స్ 5, అక్యుపెన్సీ సర్టిఫికెట్లు 2088లతో కలిపి మొత్తం 13 వేల 421 వివిధ రకాల అనుమతులను జారీ ప్లానింగ్ విభాగం అధికారులు తెలిపారు.
స్వల్పంగా పెరిగిన ఆదాయం
జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఆదాయంతో పోల్చితే ఆశించినంత స్థాయిలో పెరగలేదనే చెప్పవచ్చు. ఆర్థిక సంవత్సరం (2023-24) లో ప్లానింగ్ ద్వారా జీహెచ్ఎంసీకి రూ. 1107.29 కోట్ల ఆదాయం సమకూరగా, ఇటీవలే మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024-25) లో రూ.1138.44 కోట్లు సమకూరింది. అంటే గతేడాదితో పోల్చితే ఈ సారి ప్లానింగ్ ఆదాయం కేవలం రూ. 31.15 కోట్లు మాత్రమే పెరిగింది.
2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి గడిచిన అయిదేళ్లలో ప్లానింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గమనిస్తే అత్యధికంగా ఆదాయం ఆర్దిక సంవత్సరం (2022-23) లో అత్యధికంగా రూ.1454.76 కోట్లు కాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.1144.08 కోట్లు రాగా, ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.1138.44 కోట్లు వచ్చింది. అంటే గడిచిన 2022, 2023, 2024 సంవత్సరాల్లోని ఆదాయాన్ని విశ్లేషిస్తే గ్రేటర్ సిటీలో నిర్మాణ కార్యకలాపాలు స్వల్పంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: Women Commits Suicide: వేధింపులు.. అవమానాలు.. చివరకు ఇల్లాలి సూసైడ్..
వివిధ రకాల అనుమతుల వివరాలిలా..
టైప్ నాన్ హై రేజ్ బిల్డింగ్ లు హైరేజ్ బిల్డింగ్ లు మొత్తం అప్రూవల్స్
కమర్షియల్ 112 28 140
ఇన్ స్టిట్యూషనల్, హాస్పటల్ తదితర 19 27 46
రెసిడెన్షియల్ 2189 47 2236
2320 102 2422
గడిచిన అయిదేళ్లలో టౌన్ ప్లానింగ్ ఆదాయ వివరాలు
ఆర్థిక సంవత్సరం ఆదాయం ( రూ.కోట్లలో)
2020-21 797.13
2021-22 1044.08
2022-23 1454.76
2023-24 1107.29
2024-24 1138.44
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈలింక్ https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయగలరు