Women Commits Suicide [Iimage credit: twitter]
తెలంగాణ

Women Commits Suicide: వేధింపులు.. అవమానాలు.. చివరకు ఇల్లాలి సూసైడ్..

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : Women Commits Suicide:  అదనపు కట్నం కోసం అత్తింటివారు పెడుతున్న వేధింపులు భరించలేక ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం కేపీహెచ్​భీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్​ జిల్లా ఖానాపూర్ నివాసి సౌజన్య (29) వివాహం 2020, డిసెంబరులో మహబూబాబాద్​ జిల్లా కంబాలపల్లికి చెందిన రజనీకాంత్​ రెడ్డితో జరిగింది. పెళ్లి సమయంలో సౌజన్య తల్లిదండ్రులు కట్నంగా 18లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రస్తుతం వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

ఇక, వివాహానికి ముందు సౌజన్య ఓ ప్రైవేట్​ సంస్థలో ఉద్యోగం చేసేది. పెళ్లయిన తరువాత భర్త చెప్పటంతో ఉద్యోగాన్ని మానేసింది. ఇక, వివాహమైన తరువాత సౌజన్యతోపాటు హైదరాబాద్​ వచ్చిన రజనీకాంత్ రెడ్డి మొదట్లో ఎల్బీనగర్​ లో కాపురం పెట్టాడు. ఆ తరువాత పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం, నగదు సరిపోలేదని భార్యను వేధించటం మొదలు పెట్టాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ శారీరకంగా హింసించటం మొదలు పెట్టాడు. కొడుక్కి బుద్ధి చెప్పాల్సిన రజనీకాంత్​ రెడ్డి తల్లి కూడా అతనికే వంత పాడింది.

 Also Read: Jagityal District: కమిషన్ కొనుగోలా? ఓపెన్ వేలమా? మామిడి కొనుగోలు పై మల్లగుల్లాలు..

సౌజన్యను మానసికంగా, శారీరకంగా హింసించింది. ఈ నేపథ్యంలో సౌజన్య కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. తీరు మార్చుకోవాలని రజనీకాంత్​ రెడ్డికి చెప్పారు. అనంతరం తమ తరపు బంధువులు అధికంగా ఉన్న కేపీహెచ్​భీ ప్రాంతానికి రజనీకాంత్​ రెడ్డితో మకాం మార్పించారు. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా సౌజన్యకు భర్త, అత్త నుంచి వేధింపులు ఏమాత్రం తగ్గలేదు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మూడు పేజీల సూసైడ్​ నోట్​ రాసి మంగళవారం రాత్రి ఇంట్లో సీలింగ్​ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్​భీ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈలింక్ https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!