BJP Ramchander Rao: నగరంలో పెరుగుతున్న సమస్యలు
BJP Ramchander Rao (imagecredit:swetcha)
హైదరాబాద్

BJP Ramchander Rao: నగరంలో పెరుగుతున్న సమస్యలు.. పట్టించుకోని అధికారులు

BJP Ramchander Rao: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సమస్యలు పెరిగిపోతున్న పట్టించుకోవడం లేదని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు(N Ramachandra Rao) అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పల్లె నిద్ర కార్యక్రమంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సెక్రటరియేట్ ముట్టడికి బయల్దేరతుండగా మొయినాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ అధ్యక్షుడు రామచందర్రావు మాట్లాడుతూ… ఎన్నికలలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నెరవేర్చకుండా కాలయాపన చేయడంతో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

Also Read: Indus Waters Treaty: పాక్‌తో సింధు జలాల ఒప్పందం.. నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్దనే ఉండడంతో జిహెచ్ఎంసి(GHMC) లో ఉన్న సమస్యలను అలాగే ఉన్నాయన్నారు. వర్షాకాలం రిత్యా హైదరాబాద్(Hyderabad) ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయడానికి వెళుతున్న బిజెపి పార్టీ నాయకులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బిజెపి(BJP) పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు,బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Madhya Pradesh: షాకింగ్ ఘటన.. లేడీ టీచర్‌పై పెట్రోల్ పోసి.. తగలబెట్టిన స్టూడెంట్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క