Tourism Funds Scam ( image credit: twitter)
హైదరాబాద్

Tourism Funds Scam: బీఆర్ఎస్ హయంలో టూరిజం నిధులు పక్కదారి.. ఎన్ని కోట్లు అంటే?

Tourism Funds Scam: టూరిజం నిధులు పక్కదారి (Tourism Funds Scam) పట్టాయి. అందులో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆ నిధులను కాజేశారు. కోటి5లక్షలు తమ బ్యాంకుల్లో జమచేసుకోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూరిజంశాఖలో అకౌంట్స్ సెక్షన్ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో అదే అదునుగా తీసుకున్న ఆ ఉద్యోగి ప్రతి నెలా అదనంగా ఉద్యోగి పేరుతో కాజేస్తు వస్తుంది. ఈ ఘటన శాఖ ఆడిటింగ్ లో వెలుగుచూసుంది. దీంతో శాఖ ఉన్నతాధికారులు సీసీఎస్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నాలుగు సంవత్సరాల క్రితం తెలంగాణ పర్యాటక శాఖ హిమాయత్ నగర్ లో శృతిని కన్సల్టెంట్ గా తీసుకున్నారు.

 Also Read: Harish Rao: టూరిజం అభివృద్ధి పేరుతో సర్కార్ స్కాం.. మంత్రి హరీశ్ సంచలన కాామెంట్స్!

1.05కోట్ల నిధులు పక్కదారి

తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా జూనియర్ అకౌంటెంట్ హోదాలో నియమించారు. పర్యాటక శాఖలో పనిచేసే సిబ్బంది కార్మికులకు ఆర్టీజీఎస్ ద్వారా వేతనాలు పంపించే విధులు నిర్వహించేది. అకౌంట్ల్స్ ను ఏజీఎంలు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ పేరు ఓచర్ చూశారు తప్ప టోటల్ చూడలేదని సమాచారం. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పేరుతో ప్రతి నెలా వేతనం పేరుతో నిధులను కాజేసింది. 27 నెలలుగా 1.05కోట్ల నిధులు పక్కదారి పట్టించింది. ఒక్క అకౌంట్ నెంబర్ కు రూ. 80లక్షలు జమచేసింది. మరోవైపు అధికారులకు ఆమెకు మెయిల్ లాగిన్ ఇవ్వడంతో ఆ మెయిల్ లో వివరాలు పంపే సమయంలోనే ఒక ఉద్యోగి పేరును యాడ్ చేసినట్లు విచారణ వెల్లడైంది. ప్రతి నెలా 50 మందికి 35లక్షల అమౌంట్ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చెక్ కు వెళ్లినప్పుడు అదనంగా 2లక్షలు అదనంగా యాడ్ చేసినట్లు స్పష్టమైంది. ఆన్ లైన్ లో మాత్రం ఓ వ్యక్తి పేరు యాడ్ చేసి నిధులు డ్రా చేసింది. ఆమెకు 4 బ్యాంకుఅకౌంట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

వెలుగులోకి వచ్చిందిలా..

పర్యాటశాఖలో ఈడీగా బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి ఇయర్ వైజ్ గా అకౌంట్స్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయం, ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు ఇలా ప్రతీ వివరాలను ఇవ్వాలని చెప్పడంతో తీసుకున్నారు. పరిశీలించిన తర్వాత 1.05కోట్లు పక్కదారిపట్టినట్లు వెల్లడైంది. ఏ అకౌంట్లో జమ అయ్యాయి.. ఉద్యోగులు ఏం చేశారని ఆరా తీశారు. అకౌంట్స్ ఏజీఎంల నిర్లక్ష్యం సైతం వెలుగులోకి వచ్చింది. వారు ప్రతి నెలా చెక్, బ్యాలెన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ చేయకపోవడంతో వారు విధుల్లో నిర్లక్ష్యం చేశారని ఇద్దరు ఏజీఎంలను సస్పెండ్ చేశారు. అంతేకాదు క్యాష్ బుక్ బ్యాలెన్స్ చెక్ చేయడంతోనే జరిగిన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిధులు పక్కదారి పట్టించిన ఉద్యోగినిని సైతం విచారించినట్లు సమాచారం.

ఉద్యోగుల చార్ట్ లేదు

పర్యాటకశాఖ లో పనిచేస్తున్న ప్రభుత్వ, అవుట్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన చార్ట్ లేదు. ఉద్యోగులు ఎవరు ఏం చేస్తున్నారో స్పష్టత లేదు. అయితే పనిచేస్తున్న ఉద్యోగులను ప్రతి మూడేళ్లకు ఒకసారి.. శాఖలు మారుస్తుండాలి కానీ అలాంటిది పర్యాటకశాఖలో లేదు. దీంతో మూడునాలుగు నెలల నుంచే ఉద్యోగులకు చార్ట్ అమలు చేస్తున్నారు. గాడిలో ఇప్పుడిప్పుడే శాఖ పడుతుంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్యాటక శాఖలో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తమ ప్రభుత్వమే వస్తుందని ధీమాతో ఉన్న అక్రమార్కులు ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అవ్వడంతో ప్రభుత్వం మారుతుందనీ తేలిన సమయంలోనే పర్యాటక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో విచారణలు చేపడితే గత ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖలో 10 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక అవకతవకలు బయటపడే అవకాశం ఉంది. అప్పటి నేతలు పర్యాటకశాఖను బ్రష్టు పట్టించిన తీరు వెలుగు చూసే అవకాశం ఉంది.

 Also Read: Telangana Govt: హైదరాబాద్‌లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం

Just In

01

Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ అబ్జర్వర్ల నియామకం

Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఆ ఫోన్ కొంటే స్మార్ట్ టీవీ ఫ్రీ.. వివరాలు ఇవే..

Upasana: ఢిల్లీ సీఏం రేఖా గుప్తాతో బతుకమ్మ ఆట.. ఉపాసన రేంజ్ చూశారా?

Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెసుసా?

Puri Jagannadh: తమిళనాడులో తొక్కిసలాట.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం