Harish Rao: టూరిజం అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ సర్కార్ సర్కారు స్కాం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ధ్వజం ఎత్తారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్లాన్ వేసిందని ఆరోపించారు. ఏకంగా 15వేల కోట్ల పనులు అప్పనంగా అప్పగిస్తూ మరో స్కాంకు తెరలేపారన్నారు. లక్షల కోట్లు విలువ చేసే, వేలాది ఎకరాల భూములను తన అనుయాయులకు దారాదత్తం చేసేందుకు భారీ స్కెచ్ వేశారన్నారు. ఓపెన్ బిడ్లు పిలవలేదు, అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు.
Also Read: Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ దసరాకి నో ముక్కా, నో చుక్కా..!
ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి?
టెండర్లు పిలిచింది లేదు. నిబంధనలు పాటించింది లేదు.. కమీషన్లు దండుకునేందుకు వట్టి డంబాచారం, డబ్బా ప్రచారం అని దుయ్యబట్టారు. ఇద్దరు, ముగ్గురిని మాత్రమే కన్సల్టెంట్స్ గా పెట్టుకొని పనులను సీక్రెట్ గా ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది? అని నిలదీశారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ప్రభుత్వ భూములను, ప్రజా ధనాన్ని ఎవరికి దోచి పెడుతున్నారు? లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్స్, వైన్ యార్డు రిసార్ట్స్, లగ్జరీ హోటల్స్, వాటర్ ఫ్రంట్ రిసార్ట్స్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్కుల అభివృద్ది పేరిట మీరు చేస్తున్నది ముమ్మాటికీ స్కామే.. కమీషన్ల దందానే అని దుయ్యబట్టారు. ఈ స్కాం సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతామన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఈ దోపిడీలో భాగమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదన్నారు. ఈ మొత్తం స్కాంపై విచారణ జరిపిస్తాం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. పబ్లిక్ మనీని రికవరీ పెడుతామని హెచ్చరించారు.
బురద రాజకీయాలు మానుకోవాలి.. మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
తీవ్ర వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్.అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం..ప్రణాళికలు వేయడంలో వైఫల్యం..ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం..ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్! అని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్ లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి అన్నారు.
చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి
పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి అని హితవు పలికారు. మూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి అని సూచించారు. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Also Read: Women Safety: మహిళల భద్రత కోసం పటిష్ట వ్యూహం.. బస్సులో పొరపాటున ఈ తప్పులు చేయకండి!