TGIIC On Gachibowli Lands
హైదరాబాద్

TGIIC On Gachibowli Lands: ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదే.. ఆ వార్తలు పుకార్లే!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ:.TGIIC On Gachibowli Lands: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూమేనని, అటవీశాఖకు సంబంధమే లేదని రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ స్పష్టం చేసింది ఆ భూమిలో ఉన్న మష్‌రూమ్ రాక్స్ అనే గుట్టను, నీటి కుంటలను కూడా డ్యామేజ్ కాకుండా కాపాడేలా పర్యావరణ పరిరక్షణ ప్లాన్‌ను రూపొందించినట్లు వివరించింది. మొత్తం స్థలాన్ని ఇటీవలే రీ సర్వే చేసి అన్ని వైపులా సరిహద్దులను ఫిక్స్ చేశామని స్పష్టం చేసింది.

పక్కనే ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, వైస్ ఛాన్సెలర్ ఆదేశంతో డిప్యూటీ రిజిస్ట్రార్ సమక్షంలోనే సర్వే పూర్తయిందని వివరించింది. ఈ భూమి మొత్తం ప్రభుత్వానికి చెందినదేనని, ఉమ్మడి రాష్ట్రంలో సంస్థకు చెందిన భూమి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు తిరిగి సంస్థకే దక్కిందని వివరించింది. ఆ భూమికి చెందిన వివాదాన్ని, పరిష్కారమైన తీరును మీడియాకు తెలియజేసింది.

అందులోని కొన్ని అంశాలు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని (సర్వే నెం. 25) 400 ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం (క్రీడాభివృద్ధి, టూరిజం, సాంస్కృతిక శాఖ) ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 2004 జనవరి 13న (మెమో నెం. 39612) కేటాయించింది. క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేసే అవసరాలకు కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో 2006 నవంబరు 21న (జీవో నెం. 111080) ఆ కేటాయింపును ఆ శాఖ రద్దు చేసింది.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ కంపెనీ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ (నెం. 24781/2006)ను దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత గతేడాది మార్చి 7న వెల్లడించిన తీర్పులో ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టం చేసింది.

Also Read: Karimnagar News: ఉద్యోగమంటే ఆశపడ్డారో.. ఆ తర్వాత చిత్రహింసలే.. తస్మాత్ జాగ్రత్త!

ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ కంపెనీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (నెం. 9265/2024) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాదనలు వినిపించడంతో దీన్ని విచారించిన సుప్రీంకోర్టు గతేడాది మే 3న ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టం చేసింది. శేరిలింగపల్లి తహసీల్దార్ (డిప్యూటీ కలెక్టర్) ఈ భూమి ‘కంచె అస్తాబల్ పోరంబోక్ సర్కారీ’ భూమి అని పేర్కొని దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల వివరాలను టీజీఐఐసీకి వివరించింది.

Also Read: SLBC Rescue: టన్నెల్ లో ప్రమాదకర పరిస్థితులు.. రంగంలోకి క్యాడవర్ డాగ్స్.. అసలేం జరుగుతుంది?

భూమి స్వభావాన్ని సవరిస్తూ రెవెన్యూ శాఖకు బదిలీ చేయాలని 2022లో రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో (నెం. 671/14.9.2022) మేరకు గతేడాది జూన్ 19న ఐ అండ్ సీ డిపార్టుమెంటు సిఫారసు చేసింది.
ఐటీ పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుగా భూమిని అప్పగించాల్సిందిగా టీజీఐఐసీ చేసిన రిక్వెస్టు (2024 జూన్ 19న) రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి గతేడాది జూన్ 26న అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా రెవెన్యూ అధికారులు గతేడాది జూలై 1న అప్పగించారు.

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?