IAS Officers( image credit: twitter)
హైదరాబాద్

IAS Officers: జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్.. స్నేహ శబరీశ్ బదిలీ!

IAS Officers: రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న 2018 బ్యాచ్‌కు చెందిన అనుదీప్ దురిశెట్టి ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి దాసరి హరిచందనను హైదరాబాద్ కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన హరిచందన గతంలో జీహెచ్ఎంసీలో ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.

అలాగే ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అడ్వర్‌టైజ్‌మెంట్, యూసీడీ విభాగాలకు అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న 2017 బ్యాచ్‌కు చెందిన స్నేహ శబరీశ్‌ను హనుమకొండ కలెక్టర్‌గా సర్కార్ బదిలీ చేసింది. జీహెచ్ఎంసీలో నెలన్నర రోజుల క్రితం వరకు హౌసింగ్, లేక్స్, ఎలక్ట్రికల్స్ విభాగాలకు అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం సెలవులో ఉన్న 2011 బ్యాచ్‌కు చెందిన కిల్లు శివకుమార్ నాయుడును ఆర్‌అండ్‌ఆర్, ల్యాండ్ అక్విజేషన్, ఐ అండ్ సీఏడీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది.

 Also Read: IAS Transfers: భారీగా ఐఏఎస్ ట్రాన్స్‌ఫర్స్.. పలు జిల్లాలకు ఛేంజ్!

జీహెచ్ఎంసీలో త్వరలోనే అంతర్గత మార్పులు తప్పవా?
సర్కారు 36 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, మరో నలుగురు నాన్ క్యాడర్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో జీహెచ్ఎంసీలోని ఇద్దరు అదనపు కమిషనర్లు కిల్లు శివకుమార్ నాయుడు, స్నేహ శబరీశ్‌లను జీహెచ్ఎంసీ నుంచి బదిలీ చేసి, వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరు అధికారులను ప్రభుత్వం నియమించకపోవడంతో త్వరలోనే జీహెచ్ఎంసీలో అంతర్గతంగా బదిలీలు జరిగే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతున్నది.

కొద్దిరోజుల క్రితం వరకు జీహెచ్ఎంసీలో 14 మంది ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులతో కలిపి మొత్తం 14 మంది అదనపు కమిషనర్లు ఉండగా, ఇప్పుడు ఇద్దరు అదనపు కమిషనర్లు, అంతకు ముందు మరో అధికారి బదిలీ కావడంతో ఇప్పుడు ఆ సంఖ్య 11కు పడిపోయింది. విజిలెన్స్ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహించిన సరోజ సైతం మున్సిపల్ శాఖ కార్యదర్శి ఆఫీస్‌కు బదిలీ కావడంతో ప్రస్తుతం అదనపు కమిషనర్ల సంఖ్య 10కి పడిపోయింది.

ఒక్కో విభాగానికి ఒక్కో అదనపు కమిషనర్ చొప్పున ఇంత మంది అదనపు కమిషనర్లు అవసరమా? అంటూ పలు సందర్భాల్లో ప్రస్తుత కమిషనర్ కర్ణన్ అసహనాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించాలన్న కమిషనర్‌కు సర్కార్ చేపట్టిన బదిలీల ప్రక్రియ మేలు చేసే విధంగానే ఉన్నట్లు భావించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను జీహెచ్ఎంసీ నుంచి బయటకు పంపిన ప్రభుత్వం వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఐఏఎస్, నాన్ క్యాడర్ ఆఫీసర్లను నియమించకపోవడం ఒకరకంగా కమిషనర్ నిర్ణయాన్ని బలపర్చినట్టేనని భావించవచ్చు. ప్రస్తుతం ఉన్న 10 మంది అదనపు కమిషనర్ల సంఖ్య కుదింపు దిశగా కమిషనర్ నిర్ణయం తీసుకునేందుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తున్నది.

 Also Read: Plane Crashes In India: దేశాన్ని కుదిపేసిన ఘోర విమాన ప్రమాదాలు.. ప్రతీ ఘటన తీవ్ర విషాదమే!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?