Swetcha Effect( image credit: swetcha reporter)
హైదరాబాద్

Swetcha Effect: స్వేచ్ఛ కథనంపై స్పందించిన టాస్క్​ ఫోర్స్​.. మెఫెంటిమైన్​ ఇంజక్షన్లతో ఇద్దరు అరెస్ట్​!

Swetcha Effect: వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులను అరెస్ట్​ చేసిన టాస్క్​ ఫోర్స్​ పోలీసులు వారి నుంచి పెద్ద సంఖ్యలో మెఫెంటిమైన్​ సల్ఫేట్​ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలో జోరుగా సాగుతున్న ఈ ఇంజక్షన్ల విక్రయాలపై స్వేచ్ఛ’ రెండు రోజుల క్రితం ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన టాస్క్​ ఫోర్స్​ పోలీసులు లక్షా 32వేల రూపాయల విలువ చేసే 110 మెఫెంటిమైన్​ సల్ఫేట్​ ఇంజక్షన్లను సీజ్ చేశారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మొఘల్​ పురా నివాసి మహ్మద్​ జిబ్రాన్​ అహమద్​ ఎలియాస్​ సమీర్​ గోలీ (30) వ్యాపారి. జిమ్​ కు వెళ్లే అలవాటున్న సమీర్​ గోలీ కొంతకాలంగా మెఫెంటిమైన్ ఇంజక్షన్లను న్యూ ఢిల్లీలోని ఇండియా మార్ట్​ నుంచి ఆన్​ లైన్​ ద్వారా ఆర్డర్​ చేసి తెప్పించుకుంటున్నాడు. కాగా, వీటికి పాతబస్తీలో డిమాండ్​ ఎక్కువగా ఉండటాన్ని గ్రహించిన సమీర్​ గోలీ ఒక్కో ఇంజక్షన్​ ను 324 రూపాయలకు ఆన్​ లైన్​ ద్వారా తెప్పించుకుని గౌలిపురా మార్కెట్​ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయించటం మొదలు పెట్టాడు.

 Also Read: Bangladeshis Arrested: జన్మ ధృవీకరణ నుంచి ఓటు హక్కు వరకు.. నకిలీ జీవితం ఎలా సాధ్యం?

ఇక, బాలాపూర్​ నివాసి, బీఫ్​ షాప్​ నిర్వాహకుడు అహమద్​ ఖురేషి (30) కూడా ప్రతీరోజూ జిమ్​ కు వెళుతుంటారు. కండలు పెంచటానికి మెఫెంటిమైన్​ సల్ఫేట్​ ఇంజక్షన్లను తీసుకోవటానికి అలవాటు పడ్డ ఖురేషి కూడా న్యూ ఢిల్లీలోని ఇండియా మార్ట్​ నుంచి ఆన్​ లైన్​ ద్వారా వీటిని పెద్ద సంఖ్యలో తెప్పించుకుంటూ అమ్మటం ప్రారంభించాడు.

ఎలాంటి డ్రగ్​ లైసెన్స్​ లేకుండా డాక్టర్​ ప్రిస్క్రిప్షన్​ కూడా చూడకుండా ఈ ఇంజక్షన్లను అమ్ముతున్నట్టు తెలిసి టాస్క్​ ఫోర్స్​ సీఐ రాఘవేంద్ర, ఎస్సైలు మహేశ్​, నర్సింలు, ఆంజనేయులు, నవీన్​ లతోపాటు సిబ్బందితో కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మొఘల్​ పురా, చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్