Bangladeshis Arrested ( IMAGE credit: free pic)
హైదరాబాద్

Bangladeshis Arrested: జన్మ ధృవీకరణ నుంచి ఓటు హక్కు వరకు.. నకిలీ జీవితం ఎలా సాధ్యం?

Bangladeshis Arrested: అక్రమంగా నివాసముంటున్న ఇద్దరు బంగ్లా దేశీయులను సెంట్రల్ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు మలక్​ పేట పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. వీరికి ఆధార్​, ఓటర్​ కార్డులతోపాటు బర్త్​ సర్టిఫికెట్లను సమకూర్చిన మరో నలుగురిని కూడా కటకటాల వెనక్కి పంపించారు. వీరిలో నార్సింగి మున్సిపాలిటీలో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగి ఉండటం గమనార్హం. డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మలక్​ పేట సలీంనగర్​ కాలనీలో బంగ్లాదేశీయులు ఉంటున్నట్టుగా టాస్క్​ ఫోర్స్​ సిబ్బందికి సమాచారం అందింది.

ఈ క్రమంలో టాస్క్​ ఫోర్స్​ అధికారులు మలక్​ పేట పోలీసులతో కలిసి దాడులు జరిపారు. బంగ్లాదేశ్​ రాజధాని ఢాకాకు చెంది ఇక్కడ అక్రమంగా ఉంటున్న మహ్మద్​ హసీబుల్​ ఎలియాస్​ జోవాన్​ చౌదరి (25), రోహన్​ సాహా (21)లను అరెస్ట్​ చేశారు. వీరిని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా అక్భర్ బాగ్​ నివాసి, పాన్​ షాప్​ నడుపుతున్న మహ్మద్​ ముఖీద్​ (39), చాదర్​ ఘాట్​ వాస్తవ్యుడు డీటీపీ ఆపరేటర్​ టీ.సాయి కిరణ్​ (50), చెంచల్​ గూడ నివాసి, ఏజెంట్​ అయిన జీ.రజనీకాంత్​ (46), నార్సింగి మున్సిపాలిటీ శానిటేషన్​ విభాగంలో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా పని చేస్తున్న నార్సింగి నివాసి డీ.సుధీర్​ కుమార్​ (27)లను అరెస్ట్​ చేశారు.

 Also Read: Jammu Kashmir Terror Attack: కాశ్మీర్‌లో రక్తపాతం.. కేంద్ర హోంశాఖ వైఫల్యంపై.. రాజ్ ఠాకూర్ ఫైర్!

25 వేలు ఇచ్చి…
బంగ్లాదేశ్​ రాజధాని ఢాకాకు చెందిన మహ్మద్​ హసీబుల్​ నాలుగేళ్ల క్రితం ట్రాఫికర్లకు 25వేల రూపాయలు చెల్లించి పశ్చిమ బెంగాల్​–బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో ఉన్న బోన్​ గావ్​ నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తరువాత కొంతకాలంపాటు కోల్​ కతాలోని సౌత్​ హౌరాలో ఉన్న హసీబుల్​ కరాటే ట్రైనర్​ గా నెలకు 20వేల రూపాయల జీతానికి పని చేశాడు. ఆ సమయంలోనే జోవాన్​ చౌదరీ పేర డూప్లీకేట్​ ఆధార్​ కార్డు తయారు చేయించుకున్నాడు.

ఫేస్​ బుక్ పరిచయంతో…
ఇదెలా ఉండగా హసీబుల్​ కు 2023లో మలక్​ పేటకు చెందిన జయా చౌదరితో పరిచయం ఏర్పడింది. తన గురించిన నిజాలు చెప్పకుండా ఆమెను ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకున్న హసీబుల్ ఆ తరువాత మకాంను సలీంనగర్ కాలనీకి మార్చాడు. ఇక్కడకు వచ్చిన తరువాత ఆన్​ లైన్ ద్వారా దుస్తుల వ్యాపారం చేస్తుండటంతో స్విగ్గీలో డెలివరీ బాయ్​ గా ఉద్యోగంలో చేరాడు.

ఆ తరువాత మహ్మద్​ ముఖీద్​, సాయికిరణ్​, రజనీకాంత్​ ల సహాయంతో నార్సింగి మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్​ ఉద్యోగిగా పని చేస్తున్న సుధీర్​ కుమార్​ ను కలిశాడు. అనంతరం నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్​ సర్టిఫికెట్​ సంపాదించుకున్నాడు. దీని ఆధారంగా ఎనిమిది నెలల క్రితం డూప్లీకేట్ ఆధార్​ కార్డు, ఓటర్​ గుర్తింపు కార్డులను సమకూర్చుకున్నాడు.

 Also Read: Tips for House Construction: హైదరాబాద్ లో రూ. 2 లక్షలకే కొత్త ఇల్లు.. ఇలా ప్లాన్ చేసుకోండి

2025లో…
ఇక, మరో బంగ్లాదేశీ రోహన్​ సాహాతో కొన్ని రోజుల క్రితం హసీబుల్​ కు పరిచయం ఏర్పడింది. అప్పటికే అక్రమంగా బంగ్లాదేశ్​ సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చి కోల్ కతాలో ఉంటున్న రోహన్​ సాహా గర్భంతో ఉన్న అతని భార్యను హైదరాబాద్​ పిలిపించు8కున్న హసీబుల్ వారికి కూడా డూప్లీకేట్​ గుర్తింపు కార్డులు తయారు చేయించి ఇచ్చి ఇక్కడే ఆశ్రయం కల్పించాడు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందుకున్న టాస్క్​ ఫోర్స్ అధికారులు మలక్​ పేట పోలీసులతో కలిసి హసీబుల్​, రోహన్​ లతోపాటు వారికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్​ చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?