Gajularamaram (image credi:AI)
హైదరాబాద్

Gajularamaram: అధికారులూ.. కాస్త ఒక లుక్ వేయండి ప్లీజ్..

కుత్బుల్లాపూర్, స్వేచ్ఛ: Gajularamaram: ప్రభుత్వాలు మారినా కొందరి అధికారుల తీరు మాత్రం యధాతధంగా ఉండడంతో పూర్తీగా వ్యవస్థపై ప్రభావం పడుతుంది, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిర్మాణాలు అన్ని పారదర్శకంగా ఉండాలని గత ప్రభుత్వంలో టీఎస్ బీపాస్ చట్టాన్ని అమలు చేసిన ఇప్పటికి కూడా గాజులరామరం సర్కిల్ పరిధిలో పూర్తిస్థాయిలో ఆచరణలో పెట్టలేదంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు పట్టణ ప్రణాళిక అధికారులకు విధులపై, చట్టాలపై ఉన్న బాధ్యత మరిచి, ఇలా చట్టాలకు తూట్లు కొడుతుంటే అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ ఎక్కడ ఉంటుంది, ఒకరిని మించి మరొకరు అనుకుంటూ బరితెగించేస్తున్నారు. ఎందుకంటే అధికారులు చర్యలు తీసుకోకుండా ఎలా నివారించాలని అక్రమార్కులకు తెలుసు. ఇదంతా అధికారులు, అక్రమ నిర్మాణదారులతో కలిసి చేసే పక్కా ప్రణాళిక అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దండుకోవడమే.. దండిచడం లేదు..

గాజులరామారం సర్కిల్ పరిధిలో అక్రమాలు పెరిగిపోవడానికి అధికారుల కక్కుర్తే కారణమని, అక్రమార్కుల కాసులకు లాలూచీ పడి ఇష్టారీతిన నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు అధికారులే కల్పిస్తున్నారు. అని స్థానికుల అభిప్రాయం పడుతున్నారు. వార్తా కథనాలు ఇలా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నోటీసులు ఇచ్చాం అంతే మా పని అంటూ తోసిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అధికారులకి చర్యలు తీసుకునే ఉద్దేశం ఉంటే ఇదే నెలలో సూరారం పరిధిలోని సిద్ధి వినాయక నగర్ లో అక్రమ నిర్మాణాలపై తీసుకున్నట్టు సర్కిల్ పరిధిలోని మిగతా నిర్మాణాలపై ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Panjagutta Police Station: ఈ పోలీస్ స్టేషన్ ఒక సంచలనం.. హైదరాబాద్ లో ఇదే హైలెట్..

ఒప్పందం కుదరకనే సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారని, మిగతా నిర్మాణదారులతో ఒప్పందం కుదరడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలపై వివరణ అడిగిన నియమాల ప్రకారం తీసుకుంటామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం కేవలం గాజులరామారం పట్టణ ప్రణాళిక అధికారులకే చెందుతుంది. ఇటీవలే స్వేచ్ఛ దినపత్రికలో ” అక్రమాలపై అధికారుల శీతకన్ను ” అనే శీర్షికతో అక్రమ నిర్మణాలపై ప్రచురితమైన కథనంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంకా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

అధికారులు, అక్రమార్కుల చీకటి ఒప్పందాలే కారణమని సందేహం కలుగక మానదు. ఇప్పటికైనా దండుకోవడం మానేసి, గాజులరామారం పట్టణ ప్రణాళిక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలపై ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని లేదంటే ఉన్నతాధికారులైన కలుగ చేసుకోని అక్రమాలకు సహకరించే అధికారులతో పాటు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అంత ఎస్.టీ.ఎఫ్ బాధ్యతనే: తుల్జా సింగ్

అక్రమాలపై గాజులరామారం సెక్షన్ అధికారి తుల్జా సింగ్ ను వివరణ కోరగా… సర్కిల్ పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయి అని వాటిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్.టీ.ఎఫ్)కు సమాచారం ఇచ్చామని, నోడల్ అధికారి వద్దే పెండిగ్ లో ఉన్నాయని, చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారికి గుర్తు చేస్తున్నామని త్వరలో అన్నిటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: New Liquor Brands: కిక్కే.. కిక్కు.. విదేశీ బ్రాండ్స్ కు మరో అవకాశం..

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?