తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Panjagutta Police Station: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంచలన కేసులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. బోదన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు చేసిన రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై ఇదే స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసులు నమోదయ్యాయి. తాజాగా బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ విషయంలో 11 మంది యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు రిజిష్టర్ అయ్యాయి. గతంలో ఈ స్టేషన్ లో పని చేస్తున్న సిబ్బందిలో ఒకేసారి 86మంది ట్రాన్స్ ఫర్ కావటం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట స్టేషన్ తరచూ పతాక శీర్షికలకెక్కుతోంది.
ఎమ్మెల్యే కొడుకును తప్పించబోయి..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ 2023, డిసెంబర్ లో మద్యం సేవించిన మత్తులో కారు నడుపుతూ సీఎం క్యాంప్ కార్యాలయమైన ప్రజా భవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ దీనిపై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి రహీల్ ను స్టేషన్ కు తరలించారు. అయితే, కేసులు అతనిపై నమోదు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న ఓ యువకునిపై కేసులు పెట్టారు.
ఈ విషయం వెలుగు చూడటంతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా కేసులో దర్యాప్తు జరిపారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యే కొదుకు యాక్సిడెంట్ చేసినట్టుగా తేలటంతో రహీల్ పై కేసులు నమోదు చేశారు కాగా, విచారణలో రహీల్ ను స్టేషన్ కు తరలించిన రాత్రి బోదన్ సీఐ ప్రేమ్ కుమార్ అప్పట్లో పంజాగుట్ట సీఐగా ఉన్న దుర్గారావుతో పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్టు తేలింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా సీఐ దుర్గారావుతో మాట్లాడినట్టు నిర్ధారణ అయ్యింది.
AlsoRead: HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు
నేపథ్యంలో రహీల్ ను కేసు నుంచి తప్పించి డ్రైవర్ పై పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో అప్పట్లో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆ తరువాత రహీల్ పై నమోదైన కేసు వివరాలు బయటి వ్యక్తులకు చేరుతున్నట్టు గుర్తించి స్టేషన్ లో పని చేస్తున్న 86మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. ఇంతమందిని…అందులోనూ ఒకే స్టేషన్ లో పని చేస్తున్న వారిని ట్రాన్స్ ఫర్ హైదరాబాద్ పోలీస్ హిస్టరీలో మొదటిసారి కావటం గమనార్హం.
హరీష్ రావుపై కేసులు…
ఇక, మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై ఇదే స్టేషన్ లో కేసులు నమోదు కావటం మరోసారి సంచలనం సృష్టించింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యాపారి తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ గత సంవత్సరం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ మంత్రి హరీష్ రావు సూచనల మేరకే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీప రాధాకిషన్ రావు తదితరులు ఈ పని చేసినట్టుగా పేర్కొన్నారు. తనను బెదిరించి డబ్బు కూడా డిమాండ్ చేశారని తెలిపారు.
Also ReadMLA Sudheer Reddy: ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు.. మహిళ కార్పొరేటర్ పై ఆ వ్యాఖ్యలేంటి సార్..
మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు వద్ద పని చేసిన వంశీకృష్ణతోపాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన బుల్లితెర నటులు, ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు కావటంతో మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పతాక శీర్షికల్లోకి వచ్చింది. ఇలా వరుసగా సంచలనాత్మక కేసులు నమోదవుతుండటంతో తమపై విపరీతమైన పని భారం పడుతోందని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. ఆయా కేసుల్లో ప్రముఖులు, సెలబ్రెటీలు నిందితులుగా ఉండటంతో ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తోందన్నారు. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతోందని చెప్పారు.