SPDCL Control Rooms: గ్రేటర్ హైదరాబాద్ లో ఈనెల 6వ తేదీన నిర్వహించే గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిపేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(SPDCL) కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసింది. నిమజ్జన కార్యక్రమం నిర్వహించే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ కంట్రోల్ రూంలను సంస్థ డైరెక్టర్లు డాక్టర్ నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి ప్రారంభించారు.
దాదాపు 9 వేల మంది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారులు, ఇతర రహదారుల లైన్ డయాగ్రమ్ రూపొందించామని, క్షేత్ర స్థాయిలో పర్యటించి నెట్వర్క్ ను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ఇంజినీరింగ్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగాలకు చెందిన దాదాపు 9 వేల మంది నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు విధుల్లో ఉంటారని వెల్లడించారు. విద్యుత్ శాఖ ఏర్పాటు చేసే ప్రత్యేక కంట్రోల్ రూంలకు తోడు, జాయింట్ కంట్రోల్ రూంలలో కూడా విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
Also Read: CM Revanth Reddy: ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు.. నాటి కృషే నేటి ఫలితం
కంట్రోల్ రూమ్
ప్రజలు, మండప నిర్వాహకులు హస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కానీ, ఇతర విద్యుత్ సంబంధిత సమస్య ఉంటే కాల్ చేయాలని సూచించారు. ఎన్టీఆర్ మార్గ్ కంట్రోల్ రూమ్ కు 8712468535, 8712469909, 8712469897 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ట్యాంక్ బండ్ కంట్రోల్ రూమ్ కు 8471246994, 8712469892, 8712470026 నంబర్లకు కాల్ చేయాలన్నారు. సాధారణ ప్రజలు, భక్తులు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏదైనా విద్యుత్ సంబంధిత సమస్య ఉంటే స్థానిక సిబ్బందికి లేదా 1912 కి కాల్ ద్వారా తెలియజేయాలని నర్సింహులు తెలిపారు.
Also Read: Minister Seethakka: కవిత ఎపిసోడ్ పెద్ద డ్రామా?.. మంత్రి సీతక్క ఫైర్