Steroids Gang Arrested (image credit:Canva)
హైదరాబాద్

Steroids Gang Arrested: హైదరాబాద్ స్టెరాయిడ్స్ గ్యాంగ్ అరెస్ట్.. తీగ లాగితే డొంక కదిలింది

Steroids Gang Arrested: జిమ్​ లకు వెళ్లే యువతీ, యువకులకు స్టెరాయిడ్లను విక్రయిస్తున్న ముగ్గురిని సౌత్​ వెస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు హుమాయున్​ నగర్​ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి లక్షా 80వేల రూపాయల విలువ చేసే స్టెరాయిడ్​ ఇంజక్షన్లు, క్యాప్సూల్స్​ ను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హకీంపేట నివాసి ఇమ్రాన్​ ఖాన్​ (40) గతంలో జిమ్​ ట్రైనర్​ గా పని చేశాడు. అయితే, ఈ ఉద్యోగం నుంచి ఆశించినంత ఆదాయం రాకపోతుండటంతో తేలికగా డబ్బు సంపాదించటానికి స్టెరాయిడ్ల దందా మొదలు పెట్టాడు.

3, 4 నెలల్లోనే కండలు పెంచుకోవచ్చంటూ జిమ్​ లకు వచ్చే యువతీ, యువకులకు వాటిని అధిక ధరలకు అమ్మటం ప్రారంభించాడు. ఈ మేరకు పక్కగా సమాచారాన్ని సేకరించిన సౌత్​ వెస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు హుమాయున్​ నగర్ పోలీసులతో కలిసి ఇమ్రాన్​ ఖాన్​ ను ఎన్​ఎండీసీ రోడ్డులోని సోమ టైలర్స్​ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి స్టెరాయిడ్​ ఇంజక్షన్లు, మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్​ ఖాన్​ ను విచారణ జరుపగా గౌలిపురా నివాసి, సప్లిమెంటరీ స్టోర్​ నడుపుతున్న ఆర్​.సంజీవ్​ నుంచి తక్కువ ధరలకు ఈ స్టెరాయిడ్​ ఇంజక్షన్లు, మాత్రలను కొని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్టు వెల్లడించాడు.

ఈ క్రమంలో పోలీసులు సంజీవ్​ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రశ్నించగా సప్లిమెంటరీ స్టోర్​ నడిపిస్తున్న యాకుత్​ పురా వాస్తవ్యుడు, మెయిన్​ సప్లయర్​ అయిన మహ్మద్​ నజీర్​ పేరు వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు మహ్మద్​ నజీర్​ ను కూడా అరెస్ట్​ చేశారు.

Also Read: Pawan Kalyan: పవన్ ఫోటోస్ తెగ వైరల్.. దటీజ్ పవన్ అంటున్న జనసైనిక్స్..

వీరి నుంచి లక్షా 80వేల రూపాయల విలువ చేసే స్టెరాయిడ్​ ఇంజక్షన్లు, హార్మోన్​ రిలీజ్​ చేసే క్యాప్సూల్స్​, మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం హుమాయున్​ నగర్​ పోలీసులకు అప్పగించారు. నిందితులను అరెస్ట్​ చేసిన సీఐ ఎస్​.బాలస్వామి, ఎస్సై శరత్​ చంద్రలను అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు అభినందించారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్