Medchal Crime: గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరం పై ఎస్ఓటి(SOT) పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న7 మందిని నిందితులను పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. వీరంతా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు.
నిందితుల నుండి 2.30 లక్షలు స్వాదీనం
పేకాట ఆడుతున్న 7 మందిని పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితుల నుండి 2.30 లక్షల రూపాయల నగదు, 7సెల్ ఫోన్లు ప్లేయింగ్ కార్డ్స్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీరంతా సంగారెడ్డి(Sangareddy), గాజుల రామారం(Gajula ramaram), బౌరంపేట(Bouram Peta)కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Digital Payments: భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
