DCC Appointments (imagecredit:twitter)
తెలంగాణ

DCC Appointments: డీసీసీ ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు.. నేటి నుంచి జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు

DCC Appointments: ఎంతో కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ అధిష్టానం త్వరలో చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగాల్సిన ఈ ఎన్నిక.. ప్రభుత్వ కార్యక్రమాలతో పార్టీ నాయకులు బిజీగా ఉండటం వల్ల కొంత ఆలస్యమైంది. ఈ నెలాఖరులోగా జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధిష్టానం, దీనికోసం పరిశీలకులను నియమించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలంటే పటిష్టమైన, కొత్త నాయకత్వం అవసరమని భావిస్తోంది.

అభిప్రాయ సేకరణ ఇలా..

అధ్యక్షుల నియామకం పారదర్శకంగా, సమర్థవంతమైన వ్యక్తిని ఎంపిక చేసేలా పరిశీలకుల నియామకం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి(Rangareddy)లోని వికారాబాద్(Vikarabad), మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి(Rangareddy) జిల్లాల నియోజకవర్గాల్లోని బ్లాక్ వారీగా పరిశీలకుల నేతృత్వంలో సమావేశాలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాకు రాబర్ట్ బ్రూస్(Robert the Bruce), వికారాబాద్‌కు సురాజ్ ఠాకూర్(Suraj Thakur), మేడ్చల్ మల్కాజిగిరికి అంజలి నింబాల్కర్ల(Anjali Nimbalkarla)ను ఏఐసీసీ(AICC) పరిశీలకులుగా నియమించింది. వీరికి తోడుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాకు ముగ్గురు చొప్పున అబ్జర్వర్లను నియమించారు.

రంగారెడ్డిలో 12 బ్లాక్‌లు

నేటి నుంచి పది రోజుల పాటు బ్లాక్ వారీగా ఈ సమావేశాలు జరగనున్నాయి. రంగారెడ్డిలోని 12 బ్లాక్‌లు, వికారాబాద్‌లోని 8 బ్లాక్‌లు, మేడ్చల్ మల్కాజిగిరిలోని 10 బ్లాక్‌ల పరిధిలోని ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తారు. ఇదే సమయంలో జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. పార్టీ నిబంధనలకు లోబడి పనిచేసే వారి నివేదిక ఆధారంగా, కార్యకర్తల అభిప్రాయ సేకరణలో వచ్చిన అంశాల ఆధారంగానే అభ్యర్థులను ఎన్నిక చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read; Hyderabad: గంజాయి మత్తులో ఓ కిరాతకుడు.. చిన్నారిపై అఘాయిత్యం.. ఎక్కడంటే?

రేసులో వీరే..

జిల్లాల అధ్యక్ష పదవులకు తీవ్రమైన పోటీ నెలకొంది. గతంలో సమర్థవంతంగా పనిచేసిన చల్లా నర్సింహ్మారెడ్డి(Narasimha Reddy), రాంమోహన్ రెడ్డి(Rammohan Reddy)లకు అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యే, కార్పొరేషన్ ఛైర్మన్ వంటి ఉన్నత పదవులు కట్టబెట్టింది. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి సుమారు 10 మంది వరకు పోటీ పడుతున్నట్లు సమాచారం, అయితే ప్రధానంగా ముగ్గురు రేసులో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన భీం భరత్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా పనిచేసిన దేప భాస్కర్ రెడ్డి ప్రధాన ఆశావాహులుగా ఉన్నారు.

వికారాబాద్ జిల్లాలో ఐదుగురు..

ఈ ముగ్గురూ మూడు వేర్వేరు సామాజికవర్గాల నుంచి పోటీలో ఉండటం వలన, అధిష్టానం ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే వారికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, వికారాబాద్ జిల్లాలో ఐదుగురు పోటీ పడుతున్నా, అర్ధ సుధాకర్ రెడ్డి(Sudhakar Redddy), రఘువీరా రెడ్డి(Raguveera Reddy)ల మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా ప్రస్తుతం పనిచేస్తున్న హరివర్ధన్ రెడ్డి(Harivardhan Reddy), మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌లు పోటీలో ఉన్నారు. అధ్యక్ష రేసులో ఉన్నవారిపై స్థానిక నాయకుల అభిప్రాయ సేకరణలతో పాటు, పార్టీ పటిష్టతపై పరిశీలకులు సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం.

Also Read; Maoist Posters: వడ్డీ వ్యాపారులారా ఖబర్దార్?.. భద్రాచలంలో మావోల పోస్టర్లు కలకలం

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..