Niloufer hospital(image credit:X)
హైదరాబాద్

Niloufer hospital: బెడ్లు వెయ్యి.. బిల్లులు పదిహేను వందలకు? ఆ హాస్పిటల్‌లో సానిటేషన్ గోల్‌మాల్!

Niloufer hospital: నిలోఫర్ ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ లెక్కల్లో గోల్ మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో వెయ్యి బెడ్లు ఉంటే, ఏకంగా పదిహేను వందల బెడ్లకు శానిటేషన్ బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు సమాచారం. కొవిడ్ టైంలో ఏర్పాటు చేసిన ఎక్స్ ట్రా ఐదు వందల బెడ్లకు కూడా శానిటేషన్ బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారనే ప్రచారం స్వయంగా అదే ఆసుపత్రిలోని డాక్టర్లు చెప్తున్నారు. నిలోఫర్ దవాఖాన వెయ్యి బెడ్లతో నడుస్తుంది. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ వ్యవస్థలన్నీ ఈ బెడ్ల సంఖ్య ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ శానిటేషన్ లో ఉన్న బెడ్ల కంటే ఎక్కువ బిల్లులు వసూల్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేగాక వెయ్యి బెడ్లకు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ లు కలిపి దాదాపు 675 మంది స్టాఫ్ ఉండాలని ఆసుపత్రి రికార్డులు చెప్తున్నాయి.

కానీ ఇందులో మూడు షిఫ్టులు కలిపి వీటిలో 50 శాతం స్టాఫ్ కూడా పనిచేయడం లేదని స్వయంగా ఆసుపత్రి డాక్టర్లే పేర్కొంటున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లే బిల్లులు తీసుకుంటున్నారు. ప్రతి నెల నిలోఫర్ దవాఖానలో సుమారు కోటి 25 లక్షల వరకు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఉద్యోగులు పనిచేయకపోయినా.. బెడ్ల సంఖ్య ప్రకారం స్టాఫ్​ రాకపోయినా, బిల్లులు మాత్రం యథావిధిగా ఆసుపత్రి నుంచి తీసుకుంటున్నారు. ఇదే అంశంపై గతంలో ఆర్ ఎంవో లు, సూపరింటెండెంట్ల మధ్య డిస్కషన్ జరిగింది. కానీ ఇప్పటికీ అదే విధానంలో బిల్లులు వసూల్ చేస్తున్నారు. పైగా ఉద్యోగులు సరిగ్గా డ్యూటీలు చేయకపోయినా, కాంట్రాక్టర్ పై కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు.

అస్తవ్యస్తంగా ఆసుపత్రి పరిశుభ్రత?

నిలోఫర్ ఆసుపత్రిలో గతంతో పోల్చితే ప్రస్తుతం శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. వార్డులు, ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారైంది. డాక్టర్లు, స్టాఫ్​ నర్సులు, ఇతర స్టాఫ్​ శానిటేషన్ సరిగ్గా చేయడం లేదని నిత్యం ఆర్ ఎమ్ వోలకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఆర్ ఎమ్ వోల ఆదేశాల మేరకు అప్పటికప్పుడు క్లీన్ చేసినా, ఆ తర్వాత ఆసుపత్రి పరిశుభ్రతపై శానిటేషన్ స్టాఫ్​ పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుందని డాక్లర్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే, టీమ్, యూనియన్ గా ఏర్పడి డాక్టర్లనే బెదిరించే స్థాయికి దిగారు. గత కొన్ని రోజుల నుంచి శానిటేషన్ సిస్టమ్ పై వరుసగా ఫిర్యాదులు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

Also read: GHMC Staff Recruitment: జీహెచ్ఎంసీ సిబ్బంది భర్తీ.. కొత్త నియామకాలతో సమస్యలు తీరేనా?

కానీ ఆసుపత్రి అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని ఓ పీజీ డాక్టర్ తెలిపారు. ఇక సెక్యూరిటీ, పేషెంట్ కేర్ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది. పేషెంట్ల అటెండర్లు, ఆసుపత్రికి వచ్చే వారి నుంచి పైసా వసూళ్లూ సాధారణంగానే జరుగుతున్నాయి. మీడియాలో వార్తలు వచ్చినప్పుడే అధికారులు హాడావిడి చేసి, వ్యవస్థను చక్కదిద్దినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత వసూళ్లు సర్వసాధారణంగా మారిపోవడం గమనార్హం.

ఆ అధికారి పాత్ర ఎంతో?

నిలోఫర్ లోని పేషెంట్, సెక్యూరిటీ, శానిటేషన్ వ్యవస్థ సక్రమంగా లేకపోయినా, ఫిర్యాదులు వచ్చినా, బిల్లులు మాత్రం యథావిధిగా టైమ్ కు చేరుతున్నాయి. దీంతో సదరు కాంట్రాక్టర్ తో ఆసుపత్రిలోని కీలక అధికారి కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు భారీ స్థాయిలో కమీషన్లు అందుతున్నట్లు తెలిసింది. దీంతోనే సదరు సంస్థకు వార్నింగ్ ఇచ్చేందుకు ఆసుపత్రి ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదని స్వయంగా డాక్టర్లే వివరిస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రి సూపరింటెండెంట్ కు రెండు సార్లు ప్రభుత్వం మెమోలు ఇచ్చింది. ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చంశనీయంగా మారింది.

నాన్ డాక్టర్స్ కు బాధ్యతలు?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వ్యవస్థలను మానిటరింగ్ చేసేందుకు నాన్ డాక్టర్స్ కు బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూపరింటెండెంట్, ఆర్ ఎంవో, ఇతర డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఇతర అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఇవ్వాలని సర్కార్ ఆలోచిస్తున్నది. ఆసుపత్రితో సంబంధం లేని అధికారికి ఆయా బాధ్యతలు అప్పగించనున్నారు.

దీని వలన ఆసుపత్రి లోని కీలక అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలు కుమ్మక్కు కావని సర్కార్ భావిస్తుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో మెయింటనెన్స్ కు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ సెక్రటేరియట్ లోని ఓ అధికారి తెలిపారు. గతంలో సర్కార్ హెచ్ వోడీలు వివిధ ప్రైవేట్,కార్పొరేట్ ఆసుపత్రులలోని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిస్టమ్ పై స్టడీ చేశారు. ఆ రిపోర్టు కూడా తాజాగా సెక్రటరికి అందజేశారు. ఆ రిపోర్టు ప్రకారమే ముందుకు పోవాలని వైద్యారోగ్యశాఖ భావిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!