Real Estate Scam: కోట్ల విలువైన భూముల పై రియల్ వ్యాపారులు కన్ను. ఒకప్పుడు పంచాయతీ లేఅవుట్ తో ప్లాట్స్.. గ్రామ పంచాయతీ కేటాయించిన 10శాతం ల్యాండ్ ప్రస్తుత మున్సిపాలిటీలో చూద్దామన్న కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట చూసి చూడనట్లు వదిలేసిన ఖాళీ పార్క్ స్థలాలను రియల్ వ్యాపారాలు తిరిగి కబ్జా చేస్తున్నారు. ఆనాడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్ చేశారు. కేవలం గ్రామ పంచాయతీలోని అధికారులను, స్థానిక సర్పంచ్ల తో కుమ్మకై కొంత స్థలం వదిలేసి ప్లాట్లు విక్రయించారు. అయితే ఆనాడు ప్రజా అవసరాలకు వదిలేసిన స్థలాన్ని కబ్జా చేసేందుకు రియల్ వ్యాపారులు అక్కడక్కడ కుట్రలు చేస్తున్నారు.
మున్సిపాలిటీలతో పెరిగిన భూ విలువ..
గత 20 యేండ్ల కింద చేసిన లే అవుట్ల లో తిరిగి రియల్ వ్యాపారులు యాజమాన్యంగా మారిపోయి క్రయవిక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రదానంగా రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు, హయత్నగర్(Hayathnagar), ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో నడుస్తుంది. కొన్ని గ్రామ పంచాయితీల్లో ప్రభుత్వ, అసైండ్ భూములను కబ్జా చేసుకొని రియల్ వ్యాపారులు ప్లాట్ చేశారు. అదేవిదంగా అభ్యంతరాలు లేకపోవడంతో పట్టా భూమికి అనుకోని ఉన్న ప్రభుత్వ భూమిలో పార్కు స్థలాలను వదిలిపెట్టారు. ఈ భూమాలను వ్యాపారులు తమ అధీనంలో ఉంచుకొని అవసరాలకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో లే అవుట్ చేసి ప్లాట్స్ విక్రయించడం అంత సులభంగా లేదు. ప్రభుత్వ నిబంధనలు కఠినం కావడంతో ఎప్పుడో చేసిన లే అవుట్లో ప్రజల ప్రయోజనం కోసం వదిలేసిన స్థలలానే అమ్ముకొని బ్రతుకుతున్నారు. కానీ ఈ స్థలాలను కాపాడుకునే ప్రయత్నం అధికారులు చేయకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కులతో అధికారులు కుమ్మకై ఈ దందాను నడిపిస్తున్నట్ల ప్రచారం సాగుతుంది. పార్కుల పక్కనున్న ఇంటి యాజమాన్యులు కబ్జా చేస్తే, మిగిలిన స్థలం లే అవుట్ చేసిన యాజమాన్యం అమ్ముకుంటుంది. మున్సిపాలిటీ ఏర్పాటుతో భూమి విలువ గజానికి సుమారుగా రూ.35వేల నుంచి రూ.50వేలకు పెరిగిపోయింది.
Also Read; MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత
కోట్ల విలువైన భూమిని వదిలేస్తున్నారా..
జీహెచ్ఎంసి(GHMC) ప్రాంతానికి అనుకోని ఉన్న బడంగ్పేట్, మీర్పేట్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని పార్కు స్థలాలు అధికారులు గాలికి వదిలేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ మున్సిపాలిటీలో ఎన్ని లే అవుట్ ఉన్నాయి… అందులో ఎన్ని పార్కు స్థలాలు ఉన్నాయో కూడా లెక్కలు లేనట్టు తెలుస్తుంది. తుర్క యంజాల్)Turkish Yanzal) మున్సిపాలిటీ నాగార్జున సాగర్ ప్రధాన రహదారి పై ఉండగా మీర్పేట్, బడంగ్పేట్ సాగర్, శ్రీశైలం జాతీయ రహదారి మధ్యలో ఉంటుంది. దీంతో భూ విలువ భారీగా పెరిగిపోయింది. ఈ రహదారులకు 2కిలోమీటర్లు లోపు ఉన్న విశాఖ హిల్స్ పేస్-1, వినాయక హిల్స్, నందిహిల్స్ కాలనీలోని పార్కు స్థలాలు కొన్ని కబ్జాకు గురైన్నాయి. మరికొన్ని కబ్జాలు చేసేందుకు అప్పటి వ్యాపారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితిని తుర్క యంజాల్ మున్సిపాలిటీలోని మను హోమ్స్ అనే వ్యాపారులు చేస్తున్నారు. ఉదాహరణకు విశాఖ హిల్స్లో ఉన్న ఒక పార్కు స్థలం 1460 గజాలు ఉంటే గజానికి రూ. 40వేల చొప్పున చూస్తే రూ.5కోట్ల 80లక్షలు విలువ. ఇలాంటి కోట్ల విలువైన స్థలాలను మున్సిపాలిటీ అధికారులు రక్షించకుండా వదిలేస్తున్నారు.
హైడ్రా మాపై కన్నెయండి..
స్థానిక పరిస్థితులను బట్టి ముందుకు వచ్చి పిర్యాదు చేయలేకపోతున్నారు. వ్యక్తిగత కక్ష్యలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో విశాఖ హిల్స్ పేస్-1లో నివసించే వ్యక్తి బహిరంగంగా పిర్యాదులు చేయడంతో రియల్ వ్యాపారి ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ విధంగా ఉండటంతో ఎవరు ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో మా స్థలాలను కాపాడండి అంటూ పార్కులే హైడ్రా((Hydra))ను వేడుకుంటున్నాయి. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. హైడ్రా ఏర్పాటు చేసిన కొత్తలో బడంగ్పేట్ మున్సిపాలిటీలోని ఓ కాలనీలో కబ్జాకు గురైతున్న పార్కును అధికారులు కాపాడారు. ఇప్పుడు కూడా అదే చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.
Also Read: BJP: త్వరలోనే స్థానిక ఎన్నికలు… కానీ, బీజేపీలో మాత్రం వింత పరిస్థితి?